మోడీ ఔనన్నా.. కాదన్నా విజయం నాదే.. సుబ్రహ్మణ్య స్వామి

Publish Date:Aug 23, 2022

Advertisement

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒక ప్రత్యేక ఒరవడి. ఆయనకు పార్టీలూ, ఆ పార్టీల విధానాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు మాట్టాడేస్తారు. జనతా పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరో పార్టీ అయినా ఆయనకు పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన తన కాన్సన్ట్రేషన్ అంతా  ప్రధాని మోడీపై పెట్టారు. ఆయన టార్గెట్ గా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.

తాజాగా సోమవారం ఆయన రామసేతు అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీపై సెటైర్లతో ట్వీట్ చేశారు. రామసేతు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి విదితమే. రామసేతుపై సుప్రీం కోర్టు సోమవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టింది. అందులో భాగంగా రామసేతు పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్నది తేల్చి చెప్పాలంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మోడీపై చురకలు వేశారు.

సుప్రీం ఆదేశాలతో రామసేతు విచారణ తుది దశకు వచ్చినట్లేనని పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక కేంద్రం నోరు తెరవక తప్పదని అన్నారు. అంతే కాదు మోడీ ఔనన్నా.. కాదన్నా తానే గెలుస్తానని చమత్కరించారు.  మోడీ రామసేతు పురాతన వారసత్వ కట్టడమే అని అంగీకరిస్తే విజయం తనదనీ, అలా కాకుండా అది పురాతన వారసత్వ కట్టడం కాదని సుప్రీం కు తెలియజేస్తే 2024 ఎన్నికలలో మోడీ పరాజయం ఖాయమన్నారు. ఎలా చూసినా విజయం తనదేనని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.