జగన్ పులివెందుల కోట బద్దలు: జెండా పాతిన తెలుగుదేశం.. 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 ఏకగ్రీవం.!

Publish Date:Oct 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల పెట్టని కోట. ఐదు దశాబ్దాలకు పైగా పులివెందులలో వైఎస్ కుటుంబానిదే హవా. వైఎస్ అనంతరం జగన్ కు పులివెందుల పెట్టని కొటగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ కోట బద్దలైంది. స్థానిక సమరంలో పులివెందులలో వైసీపీ చతికిల పడింది.   పులివెందుల గడ్డపై తెలుగుదేశం పట్టు సాధించింది. స్థానిక  సమరంలో జగన్ అధినేతగా ఉన్న వైసీపీ అక్కడ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేక చేతులెత్తేసింది.   స్థానిక సమరంలో పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.  

వేంపల్లి, వేముల, చక్రాయపేట, తొండూరు, సింహాద్రిపురం తదితర మండలాల్లో జరిగిన పరిణామాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా మారాయి. వివిధ మండలాల్లోని స్థానిక సంస్థల స్థానాలను తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో పాటు, జడ్పీటీసి స్థానాల్లోనూ బలమైన ముద్ర వేశారు. దశాబ్దాలుగా ఏకపక్షంగా ఉంటూ వచ్చిన రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా పూర్తిగా రివర్స్ అయ్యాయనడానికి ఇదే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024 ఎన్నికల్లోనే  పులివెందులలో జగన్‌ మెజారిటీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచీ నియోజకవర్గంలో జగన్ పట్లు, వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది.  తాజాగా స్థానక సమరంలో వైసీపీ కాడె వదిలేయాల్సిన పరిస్థితికి చేరుకుంది.  

క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడంలోనూ, వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ కూటమి నాయకత్వం విజయం సాధించిందంటున్నారు పరిశీలకులు.  ఎన్నడూ లేనివిధంగా పులివెందుల గడ్డపై పచ్చజెండా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.  పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను, 64 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.    అలాగే  7 జడ్పీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం మూడు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.  

పులివెందులలో తెలుగుదేశం ఈ స్థాయిలో బలోపేతం అవ్వడం ఎవరి ఊహకూ అందనిది.  పులివెందులలో జగన్ స్వయంగా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, అక్కడ స్థానిక తెలుగుదేశం జోరును అడ్డుకోవడంలో విఫలమయ్యారు.   స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వస్తే, అటువంటి చోట్ల పార్టీ నాయకులకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ గతంలో బహిరంగంగా  ప్రకటించారు. అయితే, ఇప్పుడు స్వయంగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే  మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో జగన్ ఇప్పుడు ఏం అంటారు? ఏం చేస్తారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. 


[Jagan Pulivendula Forte Broken, AP Local Body Elections, TDP Sweep  Pulivendula, Jagan Stronghold, AP Politics, TeluguOne] 

By
en-us Political News

  
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.