Publish Date:Aug 23, 2022
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒక ప్రత్యేక ఒరవడి. ఆయనకు పార్టీలూ, ఆ పార్టీల విధానాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు మాట్టాడేస్తారు. జనతా పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరో పార్టీ అయినా ఆయనకు పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన తన కాన్సన్ట్రేషన్ అంతా ప్రధాని మోడీపై పెట్టారు. ఆయన టార్గెట్ గా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.
తాజాగా సోమవారం ఆయన రామసేతు అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీపై సెటైర్లతో ట్వీట్ చేశారు. రామసేతు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి విదితమే. రామసేతుపై సుప్రీం కోర్టు సోమవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టింది. అందులో భాగంగా రామసేతు పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్నది తేల్చి చెప్పాలంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మోడీపై చురకలు వేశారు.
సుప్రీం ఆదేశాలతో రామసేతు విచారణ తుది దశకు వచ్చినట్లేనని పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక కేంద్రం నోరు తెరవక తప్పదని అన్నారు. అంతే కాదు మోడీ ఔనన్నా.. కాదన్నా తానే గెలుస్తానని చమత్కరించారు. మోడీ రామసేతు పురాతన వారసత్వ కట్టడమే అని అంగీకరిస్తే విజయం తనదనీ, అలా కాకుండా అది పురాతన వారసత్వ కట్టడం కాదని సుప్రీం కు తెలియజేస్తే 2024 ఎన్నికలలో మోడీ పరాజయం ఖాయమన్నారు. ఎలా చూసినా విజయం తనదేనని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/weather-modi-says-yes-on-no-victory-is-mine-says-swamy-25-142513.html
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.