కురచ దుస్తులు..మగాడి మైండ్ సెట్ మారదా..?

Publish Date:May 10, 2016

Advertisement

 

 

 

 

 

 

 

 

 

 

బాలయ్య హీరోగా వచ్చిన" సింహా" సినిమాలో ఒక డైలాగ్ ఉంది.."పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోయ్యారా..రేప్ చేయ్యారా..అని ఒకడంటే అందుకు బాలకృష్ణ అతడి చెంప పగలగొట్టి, పొట్టి డ్రస్సులు వేసుకుంటే యాసిడ్‌లు పోస్తావా..తప్పు మగాడి మైండ్ సెట్ మారాలంటూ" హితబోధ చేస్తారు. ఇలా ఎన్ని సినిమాల్లో చూపించినా సగటు మగాడి మైండ్ సెట్ మారడం లేదు. మహిళల్ని దేవాలయాల్లోకి పురుషులతో సమానంగా ప్రవేశించేలా చేసుకున్న మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.

 

కురచ దుస్తులు వేసుకుందని..అబ్బాయిలతో తిరుగుతోందని ఓ యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేసారు. స్నేహితుడి పెళ్లిలో సంగీత్ కార్యక్రమానికి హాజరై మే 1 తెల్లవారుజామున ఓ యువతి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు అడ్డగించి, కురచ దుస్తులు ఎందుకు వేసుకున్నావని..ఈ సమయంలో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఎలా వెళ్తున్నావంటూ ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఇలాంటి వాటికి పుణెలో అనుమతి లేదని హెచ్చరించారు. అనంతరం ఆమెను కారులోంచి బయటకు లాగి దాడి చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వారం తర్వాత తీరిగ్గా నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.  ఇదే మహారాష్ట్రలో గతంలో మరో ఘటన జరిగింది. దేశ ఆర్థిక రాజధాని, మోడ్రన్ హాబ్ ముంబై లో అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళా ప్యాసింజర్‌ కురచ దుస్తులు ధరించిందని ఎయిర్‌ ఇండిగో సిబ్బంది ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆమె మోకాలి పైకి ఫ్రాక్ ధరించిందని, అందుకే ఆమెను అడ్డుకున్నామని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని ఆమె ట్రౌజర్ ధరించి వేరే విమానంలో తన గమ్యస్థానానికి చేరుకుంది.

 

నాగరిక ప్రపంచంలో మనుషులందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. స్త్రీలకు కూడా అవే హక్కులున్నాయి-వారికి నచ్చిన ఏ దుస్తులనైనా వారు ధరించవచ్చు. చరిత్ర, వారసత్వం, సంస్కృతి పేర్లు చెప్పి స్త్రీల స్వేచ్ఛను కబళించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరోకటి ఉంది కురచ దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలు పెరిగిపోయాయని కాని రెచ్చగొట్టే దుస్తులు అన్నది ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. అంటే చీర కట్టిన వాళ్ల మీద..అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఏ అఘాయిత్యాలు జరగలేదా? మిడ్డి వేసుకునే అమ్మాయిని చూసి సంస్కారంగా ప్రవర్తించే అబ్బాయిలు ఉన్నారు, చీర కట్టుకున్న కూడా వంకర బుద్ధితో చూసే అబ్బాయిలున్నారు. మారాల్సింది వాళ్ల బుద్ధి.

 

చివరిగా మనం చెప్పుకోవాల్సింది, ముళ్లుంటాయని తెలిసీ చెప్పులు లేకుండా తిరగాలనుకోవడం సాహసం అనిపించుకోదు. వస్త్ర ధారణ అయినా మరోకటి అయినా ఫ్యాషన్‌ని అనుకరించే ముందు ఎవరికి వారు దానిలోని మంచి చెడులు ఒకసారి ఆలోచించాలి. మనం జీవిస్తున్న సామాజిక పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న వారి ఆలోచనా ధోరణినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ధరించేంది మోడ్రన్ డ్రస్స్ అయినా, సాంప్రదాయ వస్త్రాలయినా వాటిని ధరించిన వ్యక్తికి వాటి వల్ల అందం, హుందాతనం పెరగాలి. శతాబ్దాలు ఇంట్లోనే ఉండిపోయిన ఆడది బయటకు వచ్చాక, రప్పించబడ్డాక ఇక చీర, ప్యాంటు ఏది కడితే ఏంటట సమాజానికి? ఎందుకీ అనవసర అభ్యంతరాలు?

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.