దాడుల‌కు గుర‌య్యేవారికి అండ‌గా ఉంటాం.. అచ్చెన్నాయుడు

Publish Date:Aug 28, 2022

Advertisement

ప‌రిస్థితులు అన‌నుకూలించిన‌పుడే దుష్ట ఆలోచ‌న‌లు మొద‌ల‌ వుతాయి. ప్ర‌జ‌ల నుంచి తిర‌స్కారం ఎదుర్కొంటున్న జ‌గ‌న్ స‌ర్కా ర్ విప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో పాటు, వారి నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌మీదా దాడుల‌కు వెనుక‌డ‌టంలేద‌ని విమ‌ర్శలు వెల్లువెత్తు తున్నాయి. దాదాపు రాష్ట్రంలో ప్ర‌తిప్రాంతంలోనూ ఈ ర‌క‌మైన విప‌ క్షాల‌పై దాడులు, తిట్ల‌పురాణాలకు వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రి స్తోంది. దానికితోడు పోలీసు యంత్రాంగం కూడా అధికార‌గ‌ణానికి వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని విప‌ క్షాలు మండిప‌డుతున్నాయి.

మూడేళ్ల పాల‌న కాలంలో రాష్ట్రంలో జ‌రిగిన దాడుల సంఘ‌ట‌న‌ల్లో ఎంత‌మందికి శిక్ష‌ప‌డింది, ఎంత‌మందిపై కేసులు న‌మోద‌ య్యాయో లెక్క‌లేద‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ఎంతో మందిని జైళ్ల‌కు త‌ర‌లించార‌న్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొం టున్న కార్యకర్తలకు నాయకు లకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి అక్రమ కేసులు, అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో  టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా?.. లేక ఫ్యాషన్ అనుకుంటు న్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదన్నారు. 

చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామన్నారు. తమ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే వారిపై చర్యలకు శ్రీకారం చుడతామన్నారు. 2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఉండదని, జగన్ రెడ్డి ఉండరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.