వయనాడ్‌లో ‘సీత సేతు’!

Publish Date:Aug 5, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడి  సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్చంధించాడు అనేది రామాయణం కథ! సీతను కాపాడటం కోసం  రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం... కానీ, ఇప్పుడు సీతే.. ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది! అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు. .. కేరళ కొండచరియల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిణి మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే, ఆమె పేరు మారుమోగుతోంది. ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శిథిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసిన ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తోన్న మద్రాస్ ఇంజినీర్ గ్రూప్‌కి నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారిణిగా జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు. 

పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వయనాడ్... అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగిపొర్లుతోన్న వాగులూ, కొట్టుకుపోయిన వంతెనలు... రెస్క్యూ టీమ్‌లు బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి.. అప్పుడే సీతా షెల్కే సివంగిలా దూసుకొచ్చారు.  పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు (బెయిలీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ పనిలోకి దిగింది. చిమ్మ చీకటి, జోరువాన మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి... మర్నాడు సాయంత్ర 5.30 గంటలకల్లా వంతెన పూర్తి చేసేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను అంత త్వరగా నిర్మించడం అంత సులువేం కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్ మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తోంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం... ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి సాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత మాత్రం... 'నన్ను మహిళగా చూడొద్దు. నేనో సైనికురాల్ని, భారతసైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నా' అని చెప్పడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం . 

బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళాధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్.గా పిలుస్తారు. ఈ ఇంజినీరింగ్ యూనిట్... సైన్యంకోసం మార్గాలను క్లియర్ చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ సమయంలో ల్యాండ్‌ మైన్లను గుర్తించడం వంటివి చేస్తుంది. అంతే కాదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేష న్లలోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్ గావ్. తండ్రి అశోక్ బిఖాజీ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆ లక్ష్యం చేరలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. రెండుసార్లు సశస్త్ర సీమాబల్ పరీక్షలో విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, మగవారికి దీటుగా మహిళలూ రాణించగలరనడానికి మేజర్ సీతా షెల్కే సరైన ఉదాహరణ. ‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు. ‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా పాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పని చేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు. వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్-స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు.... రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.