భవిష్యత్‌లో... సామాన్యుడికి అందదేమో!
Publish Date:Oct 7, 2012
Advertisement
గుండెసమస్యలు, అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదా? అయితే మీరు తప్పకుండా పుచ్చకాయ తినాల్సిందే...! ఇదే దో కొత్తగా ప్రారంభమైన విదేశీ కంపెనీ ప్రారంభోత్సవ ప్రకటన అనుకుంటున్నారా? అబ్బే కాదండీ...! ఇది లండన్‌కు చెందిన ప్యూర్డు యూనివర్శిటీ నిపుణులు హృద్రోగం, స్థూలకాయ సమస్యలను తగ్గించే గుణం పుచ్చకాయలో ఉందని వారు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దేహంలోని కొవ్వు స్థాయిని పుచ్చకాయ తగ్గిస్తుందని, దానివల్ల స్థూలకాయం సమస్య ఉండదని, అలాగే ఆవేశాన్ని తగ్గించే లక్షణం పుచ్చకాయలో ఉందని దీనివల్ల గుండెపోటును నివారిస్తుందని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇప్పుడు మనవాళ్ళు దీనిపై దృష్టి పెడతారు. ఎందుకంటే మన పూర్వీకులు పసుపులో ఔషధగుణాలున్నాయని.. అవి ముఖాన్ని కాంతివంతం చేయడంలో, సౌందర్యపోషణకు పనికి వస్తుందని ముఖంనిండా పసుపురాసుకునేవారు. అది నేటితరంలోని ఎంతోమంది ఎబ్బెట్టుగా ఉండి అంతా... అబద్ధం..! పేస్ట్‌లుగా తయారుచేసి విదేశాలనుండి దిగుమతి అయిన వాటిని అధికమొత్తం డబ్బులు పోసి కొని వాడటం ప్రారంభించారు. అలాగే పుచ్చకాయపై పరిశోధనలు ఫలితంగా ఇప్పుడు పుచ్చకాయ సుమారుగా 30 నుండి దొరుకుతుంటే.. రాబోయే కాలంలో మూడొందలు అయినా ఆశ్చర్యపోనక్కరలేదు...! అంటే పుచ్చకాయ కూడా గ్యాస్, విద్యుత్‌లా.. మారుతుందేమో...! బడా బడా వ్యాపారవేత్తలు దీనిపై దృష్టిపెడితే.. భవిష్యత్‌లో ఇది సామాన్యునకు అందకపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనదేశంలో చాలామందిలో మనవాళ్లు చెప్పింది అంతా అబద్ధంగా అనిపిస్తుంది... అదే కొత్తసీసాలో పాతసారాలా... అదే విషయం విదేశాల నుండి వచ్చిందనుకోండి అప్పుడది నమ్ముతారు...! ఇటువంటి వాళ్ళు మారరు.. అంతే!
http://www.teluguone.com/news/content/watermelon-24-17959.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





