తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.!

Publish Date:Jul 30, 2026

Advertisement

తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో  నదులు, వాగులు, వంకలు జలకళతో కళకళలాడుతున్నాయి.  దీంతో  కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో  ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో  వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. 

గోదావరి పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఇన్-ఫ్లో   పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలోని  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు   46 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తోంది. ఈ   ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 12.88 టీఎంసీలకు చేరుకుంది. 

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు  96,445 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు  24 గేట్లను  ఎత్తివేసి 96,472 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో ఆయా  గ్రామాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. ఇక పోతే..  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండటంతో అధికారులు 3 గేట్లు ఎత్తివేసి 10 వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Water boost to Telangana projects, Telangana Heavy Rains, Godavari Flood Inflow, Sripada Yellampalli Project, aliperu Dam Gates Opened

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.