అనకాపల్లి జిల్లాలో వారి ఎనర్జీస్ భారీ పెట్టుబడి

Publish Date:Apr 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రానుంది.  ప్రముఖ సంస్థ అయిన వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో   8 వేల 175  కోట్ల రూపాయలతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది.  ఇందు కోసం ఆ కంపెనీకి   ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ లభ్యమయ్యాయి. దీంతో త్వరలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారి ఎనర్జీ స్టోరేష్ సిస్టమ్ నిర్ణయించింది.  

ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం   300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ,  ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది. 

ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు  ప్రత్యక్షంగా, పరోక్షంగా  3,000 మందికి పైగా  ఉపాధి అవకాశాలు  లభించే అవకాశాలున్నాయి.  ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని వారీ ఎనర్జీస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 

వారీ ఎనర్జీస్ కు  అంతర్జాతీయ స్థాయిలో   గుర్తింపు ఉంది. గుజరాత్ , అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు   ఉన్న ఈ సంస్థ, తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అవసరమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను దేశీయంగానే అందించే అవకాశం ఉంటుంది.

రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని వారీ ఎనర్జీస్ సంస్థ భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్  తయారీలో ఈ కేంద్రం దేశంలోనే కీలక భూమిక పోషించనుందని చెబుతున్నారు.   

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.