వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ
Publish Date:Jun 21, 2025
Advertisement
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి. గురువారం రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు విశ్వ ప్రచారం చేస్తున్నారని అవేవీ నమ్మకూడదని పదవి ఎక్కడికి పోదు అని మా వెనకాల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండమురళి లెక్క మీకు ఇజ్జతి మానవత్వం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాలు విసిరారు.. మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండ మురళి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది.. ఒకరికొకరు మీడియా సమావేశంలో కూడా తిట్టుకునేవారు.. కొండ మురళి కుటుంబ సభ్యులంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆ విధంగా ఆది నుంచి ఇప్పటివరకు వీధి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి లపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో కొండ మురళి టార్గెట్ మారిందా అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ పై కూడా కొండ మురళి హాట్ కామెంట్ చేశారు... తనకు ఎస్కార్ట్ గా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవర్టుల పైన పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. వరంగల్ తూర్పులో తను ఉన్నంతకాలం రెండో లీడరు రాలేడు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కూడా ఉద్దేశించి మాట్లాడారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ ను ఆపేయాలని అంటే పోలీసులు అడ్డుకున్నా రన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయ్యారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో ఉంటానని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబం లక్ష్యమని ధైర్యంలో తాను పెద్దపులిని అంటూ మాట్లాడారు..మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరకాల నియోజకవర్గంలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని ఎన్నికలప్పుడు వచ్చి ఒకసారి గెలిపించాలని కాలు పట్టుకున్నాడని మళ్లీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలేస్తానని మాట ఇచ్చాడని గుర్తు చేశారు.. పరకాల నియోజకవర్గం నుంచి త్వరలోనే తన కూతురు కొండ సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశం చేస్తారని అన్నారు. మరో సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఆయన కనుబొమ్మలు గీసుకుంటాడని ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ అని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని,అతనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.
గత కొద్ది రోజుల నుండి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.. అప్పటినుండి మంత్రి కొండ సురేఖ పైన సోషల్ మీడియాలో పలు సంఘటనలు సంబంధించి ప్రచారం చేయడంతో పాటు అది కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గన్మెన్లను తొలగించడంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి ఎస్కార్ట్ గా వచ్చిన ఏసిపి సీఐలకు మెమోలు జారీ చేసిన ఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంనికి గురిచేస్తుంది.. వీటన్నిటిని గమనించిన కొండ మురళి ఈ విధంగా మాట్లాడారని కొండ మురళి అనుచరులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండ సురేఖ పదవి తప్పించేందుకు టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లాబింగ్ చేస్తున్నారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది
http://www.teluguone.com/news/content/warangal-congress-party-39-200395.html





