భారత్ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
Publish Date:Mar 19, 2026
Advertisement
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలోని గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడటం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధం, అమెరికా జోక్యంతో చమురుధరలకు రెక్కలు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ భారత స్టాక్ మార్కెట్ల పతనాన్ని శాశించాయి. గురువారం (మార్చి 19) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు మార్కెట్‌ను మరింత భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 110 డాలర్ల మార్కును దాటింది. ఈ యుద్ధం కారణంగా రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనమైంది. దీంతో దిగుమతులు మరింత భారంగా మారాయి. అమెరికా స్టాక్ మార్కెట్ డౌ జోన్స్, జపాన్‌కు చెందిన నిక్కీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. ఒక్క గురువారం రోజునే స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా దాదాపు రూ. 8 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్స్యూమర్ సెక్టార్ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి.
http://www.teluguone.com/news/content/war-effectm-massive-36-215794.html





