పాక్ యుద్దభేరి .. సూసైడ్ స్క్వాడ్‌తో అఫ్గాన్ రెడీ!

Publish Date:Feb 27, 2026

Advertisement

పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య ఘర్షణలు మరోసారి భగ్గు మంటున్నాయి.   ఆఫ్గాన్ చేసిన దాడులకు ప్రతిగా పాక్ గజబ్ లిక్ హక్   ఆపరేషన్‌ను ప్రారంభించింది.  కాబుల్, కాందహార్‌, పక్తియాల్లోని పలు నగరాలపై వైమానిక దాడులు చేపట్టింది. దాంతో రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ  నేపధ్యంలో సూసైడ్ స్క్వాడ్  అంటూ ఆఫ్గాన్ మీడియా విడుదల చేసిన చిత్రం ఆందోళన రేపుతోంది. ఆ చిత్రాన్ని షేర్ చేసిన బక్తర్ న్యూస్ ఏజెన్సీ వారంతా సూసైడ్ బాంబర్ల బెటాలియన్ అని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

వారంతా పేలుడు పదార్ధాలు అమర్చిన దుస్తులు, కారు బాంబులతో పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రాంతాలు టార్గెట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించింది. గురువారం పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్గాన్ దాడులు చేయడంతో తాజా ఘర్షణలు చెలరేగాయి. తాము చేసింది ప్రతీకారదాడులే అని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఆ వెంటనే పాక్ యుద్దాన్ని ప్రకటించింది. తమ దాడుల్లో  130 మంది ఆఫ్గాన్ ఫైటర్లు చనిపోయినట్లు పాక్ వెల్లడించింది. మరోవైపు 50 పాక్ సైనికులు మరణించారని ఆఫ్టాన్ ప్రకటించుకుంది. ఇక రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఇరాన్ ముందుకొచ్చింది.

By
en-us Political News

  
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
ప్రపంచ అణు విధానాలు, సాంకేతిక పురోగతులు, మరియు భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంచనా వేయడానికి, యురేనియం సుసంపన్నం మరియు ప్లూటోనియం ఉత్పత్తి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అత్యవసరం.
ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది.
గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది.
ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థినితో తనకు ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమించానంటూ ఆమెను వేధించసాగాడు. అయితే ఆమె నిరాకరిచడంతో వెంకటేష్ ఉన్నాదిగా మారిపోయాడు. శనివారం కీర్తనపై కత్తితో దాడి చేశాడు.
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న కేరళ అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీ పదవికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను సూచించింది. వీరిలో వినాయక్ ప్రభాకర్ ఆట్టే, సౌమ్య మిశ్రా తో పాటు సీవీ ఆనంద్ పేరు కూడా ఉంది.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది.
తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఆ జంట వినూత్నంగా నిర్వహించింది. ఈ వేడుకను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థీమ్ తో నిర్వహించిన ఆ జంట.. ఒక చిన్న ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించారు. ఆ జెర్సీ వెనుక నంబర్ 18, విరాట్ అని పేరు ముద్రించారు. తద్వారా వారు తమ కుమారుడికి విరాట్ అన్న పేరు పెట్టినట్లు చాటారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత గంటల వ్యవధిలో రష్యా మాజీ ప్రధాని మెద్వెదేవ్ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిందన్న బాంబు లాంటి వార్తను వెల్లడించారు. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను అమర్చారు.
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.