దాడుల దారి దాడులదే.. చర్చల దారి చర్చలదే.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

Publish Date:Apr 10, 2026

Advertisement

మిడిల్ ఈస్ట్ లో శాంతి అవసరమే అంటున్న ఇజ్రాయెల్ లెబనాన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించి ఒక అడుగు ముందుకు వేసింది. అయితే దాడుల దారి దాడులదే.. శాంతి చర్చల దారి శాంతి చర్చలదే అంటూ మెలికపెట్టింది.  లెబనాన్ తో కాల్పుల విరమణ ఉండదు కానీ, అందు కోసం ఆ దేశంతో చర్చించడానికి రెడీ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి  బెన్యామిన్ నెతన్యాహు అంటున్నారు.   అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు.  

ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా దాడుల విరమణకు, శాంతి చర్చలకు నెతన్యాహు అంగీకరించారు. అయితే ఆ చర్చలు విజయవంతమయ్యే వరకూ లెబనాన్ పై దాడులను ఆపే ప్రశక్తే లేదన్న మెలిక పెట్టారు. అంటే లెబనాన్ తో చర్చలు ఫలవంతం అయిన తరువాతనే ఇజ్రాయెల్ దాడులను విరమిస్తుందని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ విధించిన ఈ షరతు లేదా నిబంధనకు లెబనాన్, హిజ్బుల్లా ఏ మేరకు అంగీకరిస్తాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో తీసుకు వచ్చిన ఒత్తిడి కారణంగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒకింత మెత్తబడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒకవేళ ఈ ఒప్పందం సజావుగా సాగితే శాంతి నెలకొనే అవకాశాలున్నాయన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది.  మొత్తం మీద నెతన్యాహు ఒకింత వెనక్కు తగ్గడం మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపనకు పడిన ఒక ముందడుగుగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో?

By
en-us Political News

  
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు.
తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం.
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.