ఊపిరి తీయాలనుకున్న సంస్థే ఊపిరి పోస్తోంది.. సాహో విశాఖ స్టీల్ ప్లాంట్
Publish Date:Apr 25, 2021
Advertisement
ఊపిరి తీయాలనుకున్నారు.. అమ్మకానికి పెట్టేశారు.. కార్మికులు, జనాల ఆందోళనను పట్టించుకోలేదు. అయితే ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణం పోస్తోంది. ప్రాణ వాయువును అందించి ప్రజల ప్రాణాలు నిలబెడుతోంది. అమ్మకానికి పెట్టాలని చూసిన సంస్థే.. ఆయుషు పోస్తూ అపర సంజీవనిలా నిలుస్తోంది. దేశానికి ప్రాణం పోస్తున్న ఆ సంస్థే ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్. కరోనా కల్లోలంతో దేశమంతా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ లేక రోగులు విలవిలలాడుతున్నారు. విపత్కర సమయంలో దేశానికి పెద్ద దిక్కుగా నిలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి దేశానికి ప్రాణం పోస్తోంది. కరోనా సోకి మృతువుతో పోరాడుతున్న వేలాది మందికి జీవధారగా మారింది. దేశమంతా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు చూస్తుందంటే దాని విలువ ఎంత ముఖ్యమే అర్ధం చేసుకోవచ్చు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి అనుకుంటున్నారా.. ఇనుమును తయారు చేసే క్రమంలో భూమి లో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్ ను స్టీల్ గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్ లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది. ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన "కోక్ " ను మరియు ఐరన్ ఓర్ ను దానికి కాల్షియం కార్బోనేట్ ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్ ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్ లోకి పంపుతారు..అంటే హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ కావాలన్న మాట. మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ ? అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్ ను నెలకొల్పుకుంది. ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయరు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది. వాతావరణంలోని గాలి లో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉంటుంది. Air compressor ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వార మలినాలు వేరు చేసి జియోలైట్ బెడ్ తో నింపబడిన PSA generator ద్వారా నైట్రొజన్ ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు.ఇలా పలుమార్లు శుద్దీకరించబడిన ఆక్సిజన్ ను మెడికల్ ఆక్సిజన్ గా సిలిండర్ లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ ను జగన్ రెడ్డి సర్కార్ సహకారంతో అమ్మాలని చూస్తే.. ఆ సంస్థే నేడు దేశానికి జీవం పోస్తోంది. "యాభైరెండు అంగుళాల ఛాతీ" కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ ప్రధాని మోడీ టార్గెట్ గా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా మోడీ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/vizag-steel-plant-giving-oxygen-to-covid-patients-25-114269.html





