వైజాగ్‌లో సముద్రం వెనక్కి వెళ్ళింది

Publish Date:Oct 8, 2025

Advertisement

 

విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది తీరం నుంచి సముద్రం దాదాపు 150 నుంచి 200 మీటర్లు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సముద్రపు అలలతో దూరంగా కనిపించే బండరాళ్లు బయటకు వచ్చే వీటిపై నిలబడి సందర్శకులు సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు. ఇంతకీ వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి ముందుకు వస్తుందా అసలు సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది తెలుసుకుందాం 

 సాధారణంగా తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు సముద్రపు అలల రాకపోకల్లో  మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు తుఫాను సునామి లేని కాలంలో కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది. నిజానికి తీరంలో ఆటుపోట్లు అలల ఎత్తు పొలాలు వేగంలో తేడాతో ప్రతిరోజు సముద్రం కొంత వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం జరుగుతుంది అలా రోజులు రెండుసార్లు కచ్చితంగా సముద్రం కొంచెం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తుంది. ఇది రోజు బీచ్ పరిశీలించే మత్స్యకారులకు తెలుస్తుంది కానీ ఇప్పుడు చూస్తే సముద్రం చాలా వరకు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో కూడా అలల తాకిడిలో మార్పు

 సముద్రపు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు సముద్ర ప్రవాహ దిశ ఒక దిశ నుంచి మరో దిశకు మారే సమయంలో కూడా సముద్రం ముందుకు వెళ్లడం వెనక్కి రావడం జరుగుతుంది . ఈ పరిస్థితి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది ఆ సమయంలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్ళినప్పుడు సముద్రపు ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ తీరం నుంచి వెనక్కి తీసుకు వెళుతుంది. అప్పుడు సముద్రం వెనక్కి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించడం కాక అప్పటివరకు నీటిలో ఉన్న బండ రాళ్లు ఇతర వస్తువులు మనకి కనిపిస్తాయి.

 అయితే ఇది మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే నీరు ముందుకు వస్తుంది. ఇది ఒకరోజులో మారవచ్చు కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు పాటు కూడా ఉంటుంది ఇదంతా వాతావరణ పరిస్థితిలపై ఆధారపడి జరుగుతుందని సముద్ర వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు . ఇప్పుడు కూడా సముద్ర ఉపరితలం మీదుగా వీచే గాలుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని ఓషినో గ్రఫీ అధికారులు చెప్తున్నారు. సందర్శికులు ఏమంటున్నారు 

 గడిచిన రెండు రోజులుగా సముద్రపు నీరు వెనక్కి వెళ్లడంతో సందర్శిక్కుల్లో సందడిగా అనిపిస్తుంది ఆర్కే బీచ్. వద్ద సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన బండరాళ్లపై నిలబడి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ఇది ఒక రకంగా సందర్శకుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు చిన్నప్పుడు నుంచి గమనిస్తున్నావని స్థానిక మత్స్యకారులు ఏ ఎస్ ఆర్ తెలిపారు. ఎక్కువగా తుఫాన్లు సునామి వచ్చినప్పుడు సముద్రం ఇలా వెనక్కి వెళ్లి చాలా వరకు ముందుకు వచ్చిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే సముద్రం వెనక్కి వెళ్లిన పరిస్థితుల్లో మళ్లీ ఏదో ఒక రోజు ముందుకు వస్తుంది అది కొన్నిసార్లు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి సముద్రంలో ఫోటోలు దిగడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా నీరు వెనక్కి వచ్చి స్థిరంగా నిలబడినట్లైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పటికే లైఫ్ గార్డ్ సిబ్బంది పర్యాటకులకు చెబుతున్నారు. కానీ చల్లగా అందంగా వాతావరణం మారడం సముద్రం చాలా లోతుగా వెనక్కి వెళ్లడంతో ఇతరుల హెచ్చరికలు పట్టించుకునే స్థితిలో పర్యాటకులు కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో రెండు రోజుల్లో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.