విశాఖలో అట్టహాసంగా యోగా దినోత్సవం
Publish Date:Jun 21, 2025
Advertisement
విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు. దాదాపు 15 వేల మందితో కలిసి ఆయన కాళీ మాత ఆలయం వద్ద యోగాసలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు యోగాసలు వేశారు.ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.‘‘అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ.
గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు’’ అని మోదీ అన్నారు.అంతర్జాతీయ యోగా డే కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఒకే స్ట్రెచ్ లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు దీంతోపాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేచోట నిన్న చేసిన యోగాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేశ్ పాత్ర కీలకమైందని..నూతన కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఈ ఏడాది విశాఖలో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం’’ అని ప్రధాని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు
http://www.teluguone.com/news/content/visakhapatnam-39-200385.html





