గచ్చిబౌలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
Publish Date:Jun 21, 2025
Advertisement
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 5 వేల మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని యోగాసలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని.. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధమన్నారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు. కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువని చెప్పారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తుమని వెల్లడించారు
http://www.teluguone.com/news/content/gachibowli-stadium-39-200387.html





