Publish Date:Jul 26, 2022
మామిడి చెట్టు పై కొమ్మకి ఉన్న కాయను చూసి పిల్లాడు అడిగాడు. చాలా ఎత్తులో ఉంది రేపు కోసిస్తాను అన్నాడు తండ్రి. వారం అయినా ఏం మాట్లాడలేదు. పిల్లాడు అలిగాడు. పెరట్లోకి తీసికెళ్లి తండ్రిని డిమాండ్ చేశాడు. అదింకా కింద పడలేదు, పడినతర్వాత చూద్దామన్నాడు. అదుగో అలానే ఉంది విశాఖ రైల్వేజోన్ వ్యవహారం. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి విశాఖ రైల్వేజోన్ ని తాయిలంలా చూపింది. ఎన్నికలకు ముందు ఆ తాయిలం చూపించి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంది. అనేక రాష్ట్రాలకు ఇచ్చి న హామీలతో పాటు ఆంధ్రాకు సంబంధించిన విశాఖ రైల్వేజోన్ సంగతి కూడా అటకెక్కించింది మోదీ సర్కారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉందని మంత్రులు, ఏంపీలు, సీఎం కూడా ప్రజలకు చెబుతూనే ఉన్నారు. కానీ కేవలం చెప్పడం, వారు మభ్యపెట్టడమే ఇన్నాళ్లూ జరుగుతోంది. వీరి మధ్య విశాఖ జోన్ విషయంలో భాషాంతరమేమన్నా ఉందేమోననుకున్నారంతా. అదేమీ కాదు కేంద్రం కావాల నే జాప్యం చేస్తున్నదని ఇటీవలే బాగా స్పష్టమయింది. ప్రధాని సుముఖానికి చాలాసార్లు వెళ్లిన సీఎం జగన్ ఈ అంశాన్ని గురించి అసలు చర్చించారో లేదో ఇంతవరకూ తెలీదు. అసలు ఆయన పర్యటనల సారాంశం ఎప్పుడూ రహస్యమే. అందుకే ఆయన స్వంత పనులమీద వెళ్లివస్తున్నారన్న ఆరోపణలే ఎ క్కు వయ్యాయి. ఇహ ఇప్పుడు కేంద్రానికి అసలు దాన్ని గురించి ఆలోచించే సమయమే లేదని అంటు న్నది. ఎవరు ఎవర్ని భ్రమలో పెట్టారన్నది దీన్నిబట్టీ తెలుస్తోంది.
గతంలో కేంద్రమే తీసుకున్ననిర్ణయాన్ని వారే నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వారికి అవసరమైన సమ యంలో రాష్ట్రానికి కావలసినవి చేస్తామనడం, ప్రజలు, నాయకుల మాటని విన్నట్టు నటించడం తప్ప వాస్తవానికి ఏమీ ఆలోచించడం లేదు. అన్నింటికంటే విచిత్రమేమంటే ఎలాంటి రైల్వే జోన్ లేదనీ చెబు తూండడం. మరోవంక బీజేపీ నేతలు ఇచ్చేశామని ప్రచార హడావుడి చేయడం. దీనికి తోడు గత ఫిబ్రవరి లో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంటులోనే కేంద్రం తేల్చి చెప్పేసిం ది. ఇక కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు. అసమర్ధ పాలకుడు, మాటలు నేర్చిన మాంత్రికుడితో కలిస్తే ఇలానే ఉంటుంది. కేంద్రం కేవలం కబుర్లు చెప్పడం తప్ప కొత్త రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదన్న అభిప్రాయాలకు ఇది మరింత ఊతమిస్తోంది.
కేంద్రం విశాఖ రైల్వేజోన్ అంశాన్ని పాతబడ్డ చింతకాయపచ్చడిగా పేర్కొంటూ దాన్ని గురించి చర్చోప చర్చలు చేయడం శుద్ధ దండగ అంటోంది. పైగా వాల్లేరు డివిజన్‌ను ఓడిషాలో కలిసేసింది. చిత్రమే మంటే, విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను లాగేసు కుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర దాసోహం అంటూండటమే అందుకు కారణమనే విమర్శలు వినపడుతు న్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visakha-rlyzone-a-dream-not-come-true-25-140572.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.