Publish Date:Jan 20, 2022
యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇది ఏ హీరో బిరుదో కాదు. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ యాటిట్యూడ్. మాటంటే పడడు. మాటకు మాటని తీరుతాడు. అరిస్తే ఊరుకోడు. మరింత గట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తాడు. మీద మీదకు వస్తే ఊరుకోడు. మరింత మీదకు ఉరుముకొస్తాడు. ఈ దూకుడు స్వభావమే.. కోహ్లీకి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. టీమిండియాకు కెప్టెన్‌ని చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఫ్యాన్స్ చేసింది. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తనను అర్థాంతరంగా తొలగించినా.. టెస్ట్ కెప్టెన్సీని తానే స్వయంగా వదులుకున్నా.. తనకు స్వతహాగా వచ్చిన దూకుడును మాత్రం అట్టే పెట్టుకున్నాడు. అలానే కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే.. ఆ కోపం లేనిదే కోహ్లీ లేడు.. ఆ ఆవేశం లేనిదే అతడు లేడు.. అతని ఆట తీరుకు డీఫాల్ట్ సెట్టింగ్ ఆ యాంగ్రీ యాటిట్యూడ్.
కెప్టెన్‌గా అగ్రెసివ్‌గా ఉండే విరాట్ కోహ్లీని ఇన్నాళ్లూ మనం చూశాం. లేటెస్ట్‌గా, ఐదున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని.. జస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తను ఆడిన తొలి వన్డే మ్యాచ్ చూశాం. అందులోనూ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేలో భారత్ ఓడిపోయినా.. కోహ్లీ మాత్రం బ్యాటింగ్‌లో గెలిచాడు.
ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కెప్టెన్సీ లేకపోయినా మైదానంలో తన దూకుడు ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు. ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ వన్డేలో.. టెంబా బవుమా (110), డస్సెన్ (129*) సెంచరీలతో రాణించారు. 36వ ఓవర్‌లో మాజీ కెప్టెన్ కోహ్లీ, సఫారీల కెప్టెన్ టెంబా బవుమా మధ్య డైలాగ్ వార్ నడిచింది.
చాహల్ వేసిన బంతిని బవుమా కొట్టగా మిడాన్‌లో ఉన్న కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే కీపర్‌కు బాల్‌ను త్రో చేశాడు. ఆ బాల్ బవుమా పైనుంచి వెళ్లింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకున్నారు. కొద్దిసేపటికే ఆ వివాదం సద్దుమణిగింది. తాను కెప్టెన్‌ను కాదు.. తనకేంటి అని లైట్ తీసుకోకుండా.. మాటకు మాట గట్టిగానే సమాధానం ఇచ్చాడు కోహ్లీ. దటీజ్ రియల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/virat-kohli-aggressive-behavior-in-sa-odi-25-130487.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.