విజయ్ విజయం క్రెడిట్ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటం!

Publish Date:May 4, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాలను  దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి  టీవీకే అధినేత,  దళపతి,  విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) గండి కొట్టింది. రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరిచే అద్భుత విజయాన్ని అందుకుంది.  తొలి ప్రయత్నంలోనే అగ్ర శ్రేణి పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ ప్రభంజనం సృష్టించడం   దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. సందట్లో సడేమియా అన్నట్లు విజయ విజయంలో తమకు కూడా భాగం ఉందంటూ వైసీపీ ఆ క్రెడిట్ ను చోరీ చేయడానికి (తమ ఖాతాలో వేసుకోవడానికి) ఆరాటపడుతోంది. 

తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ..  వైసీపీ   సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది.  విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది. 

నిజానికి వైసీపీకి, తమిళనాడు రాజకీయాలకు మధ్య సంబంధం ఇప్పుడొక విచిత్రమైన మలుపు తిరిగింది. గతంలో వైసీపీ నాయకత్వం ప్రస్తుత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీ సీనియర్ నేత..  మాజీ మంత్రి రోజా స్వయంగా తమిళనాడుకు వెళ్లి డీఎంకే తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. స్టాలిన్ పాలన జగన్ పాలన లాగే అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు రోజా.  డీఎంకే మళ్లీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని నాడు ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుత ఫలితాలతో   సీన్ రివర్స్ అయిందని గ్రహించిన వైసీపీ.. వెంటనే ప్లేటు ఫిరాయించింది.  నిన్నటి వరకు స్టాలిన్ జపం చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు అకస్మాత్తుగా విజయ్ భజన మొదలెట్టేశాయి.

ఈ క్రెడిట్ పాలిటిక్స్ పై నెటిజనులు వైసీపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో సొంత ప్రాబల్యాన్ని కోల్పోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ..  పొరుగు రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ సాధించిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ తన వ్యక్తిగత కరిష్మా, సుదీర్ఘ కాలంగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొంటూ.. విజయం విజయంలో వైసీపీకి ఆవగింజలో పావువంతు కూడా సంబంధం లేదని ఏకిపారేస్తున్నారు.  

మరోవైపు, విజయ్ అభిమానులు కూడా ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత స్వతంత్రంగా, ఎవరి అండ లేకుండా ప్రారంభించారని..  ఈ విజయం పూర్తిగా ఆయన కష్టార్జితమనీ, ఈ విజయం క్రెడిట్ లో ఎవరికీ భాగం లేదనీ విస్పష్టంగా చెబుతున్నారు.   ఏది ఏమైనా, పొరుగు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కూడా తమ ఉనికిని చాటుకోవాలని వైసీపీ పడుతున్న తాపత్రేయం నవ్వులపాలౌతోంది.  

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.