Publish Date:Dec 18, 2025
బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నెల 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల 15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హాదీ బుధవారం (డిసెంబర్ 18) రాత్రి మరణించాడు. దీంతో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు తెగబడ్డారు. చిట్టగాంగ్ లోని భారత హైకమిషన్ కార్యాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
అలాగే దేశ వ్యాప్తంగా పలు నగరాలలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితుుల నెలకొన్నాయి. రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలూ దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా సంస్థలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో డైలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు. అలాగే అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/violance-erupted-in-bangladesh-36-211239.html
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్‌లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్‌కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోసం వీరిని విచారించ నున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందు కోసం రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు.
మూడు రోజులు అవుతున్నా మంటలు అదుపులోనికి రాలేదు కానీ, బుధవారం నాటికి మంటల తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి.