మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ నుంచంటే?

Publish Date:Apr 11, 2025

Advertisement

రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటి నుంచి అంత సులభంగా బయటకు రాలేదు. విజయసాయి రెడ్డి అందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అయితే ఆయన రాజకీయ సన్యాస ప్రకటనను అప్పట్లోనే ఎవరూ నమ్మ లేదు. రాజకీయ సన్యాసం కాదు, విరామం మాత్రమేనని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద చర్చ జరిగింది.

వాస్తవానికి జగన్ నేతృత్వంలోని వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచారు. అంతకు ముందు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కు సహ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అటువంటి విజయసాయి రెడ్డికి వైసీపీ వినా మరో ఆప్షన్ ఉండదనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా విజయసాయి వైసీపీని వీడటమే కాకుండా.. ఆ తరువాతి పరిణామాలలో జగన్ కు షాక్ ఇచ్చేలా కొన్ని అంశాలను రివీల్ చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కర్త, కర్మ, క్రియా అంతా జగన్ సమీప బంధువు సుబ్బారెడ్డి కుమారుడేనని చెప్పడం, అలాగే ఏపీ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని రివీల్ చేయడం జగన్ కు మింగుడుపడని అంశాలే. విజయసాయి రెడ్డి నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా ఆయన మాటల వెనుక అర్ధం ఆ రెండు వ్యవహారాలలోనూ తెరవెనుక ఉన్నది జగనేనని చెప్పకనే చెప్పారని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు.

అంతే కాకుండా ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని ఉప ఎన్నికలో మళ్లీ ఆయనే బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన తీరు కూడా ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ విజయసాయి రెక్కలు కట్టుకుని వాలిపోయి ఆయనకు స్వాగతం పలికారు.  

ఇప్పుడు తాజాగా స్వల్ప విరామం తరువాత విజయసాయి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, ఈ సారి ఆయన తన సేవలూ, విధేయతా బీజేపీ వైపు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఆ కథనాల ప్రకారం ఆయన రాజ్యసభకు వెడతారు. అయితే ఈ సారి బీజేపీ తరఫున ఆయన రాజ్యసభలో అడుపెడతారు. ఆ కథనాలకు బలం చేకూర్చే విధంగా విజయసాయి రెడ్డి మోడీని ప్రశంసలతో ముంచెత్తతూ శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఉంది.

ఆ పోస్టులో విజయ సాయి ముంబైపేలుళ్ల సూత్రధారి తహవ్వుర్‌ రాణా ను భారత్ కు రప్పించడం మోడీ దౌత్య విజయంగా అభివర్ణించారు.  మోడీ నేతృత్వంలో   దేశ భద్రతకు ముప్పు తలపెట్టిన ఏ ఉగ్రవాదినీ భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని విజయసాయి ఆ పోస్టులో పేర్కొన్నారు.  దీంతో విజయసాయి బీజేపీ గూటికి చేరి, రాజ్యసభలో అడుగుపెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని పరిశీలకులు భావిస్తున్నారు. 

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.