బొద్దింకలకు జగన్ మద్దతు: వ్యూహాత్మకమా.. బీజేపీతో తెగతెంపులా.?

Publish Date:Oct 16, 2026

Advertisement

దేశ రాజకీయాలలో  కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  ఎన్నికల సంఘం  చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ ,  అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు   నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్   కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి  తీహార్ జైలుకు తరలించారు.   ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. 

 జగన్ బొద్దింకలకు  మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ   కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్   ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో  జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు. 

[YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]

By
en-us Political News

  
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.