విజయసాయిరెడ్డి కొత్త అవతారం.. విజిల్ బ్లోయర్!

Publish Date:Apr 22, 2025

Advertisement

జగన్ కు అత్యంత విశ్వసనీయ సహచరుడు, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ తో కలిసి నడిచి, ఆఖరికి ఆయన అక్రమాస్తుల కేసులో కూడా సహనిందితుడిగా జైలు జీవితం కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు.  వైఎస్ కుటుంబంతో  సుదీర్ఘ అనుబంధం, ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటూ వచ్చిన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాల గుట్టుమట్లన్నీ విప్పుతానంటున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత.. ఇంకా పార్టీకి ఏమైనా మిగిలి ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠనూ కూడా దిగజారుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరినీ బయటకు లాగుతానని చెబుతున్నారు. 

రాజ్ కసిరెడ్డి అరెస్టు అనంతరం సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో తనను తాను ఒక విజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ పాత్రేనని చెప్పుకున్నారు. అయితే ఈ కుంభకోణంలో దొరికిన దొంగలు, ఇంకా దొరకకుండా ఉన్న దొంగలూ కూడా తమను తాము కాపాడుకోవడానికి తన పేరు లాగుతున్నారని ఆరోపించారు.  ఈ కుంభకోణంలో ఇంకా దొరక్కుండా తప్పించుకుని  తిరుగుతున్న దొంగల గుట్టుమట్లన్నీ తాను బయటపెడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  నిన్న మొన్నటి వరకూ జగన్ తోనూ, ఆ అధినేతగా ఉన్న వైసీపీతోనూ అంటకాగి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని అందరి బాగోతం బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.

 

 

అందుకే రాజ్ కసిరెడ్డి అరెస్టు అయిన వెంటనే.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారల కమిటీతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. విజయసాయి రెడ్డి సిట్ దర్యాప్తులో పాల్గొన్న రెండు రోజుల వ్యవధిలోనూ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. ప్రశ్నలు సంధించింది. దీంతో  విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అలాగే రాజ్ కసిరెడ్డే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని విజయసాయి మీడియా ముఖంగా చెప్పిన తరువాతే ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రమేయం గురించి అందరికీ తెలిసింది. కాగా విజయసాయి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి చరిత్రను తానూ బయటపెడతానంటూ ఓ వీడియో విడుదల చేశారు.

దీంతో విజయసాయి రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి మద్యం కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోతాన్నీ బయటపెడతానంటూ ట్వీట్ చేశారు. గతంలో సంగతి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం వజియసాయి రెడ్డి విజల్ బ్లోయర్ గానే పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసారి నోరు విప్పితే.. జగన్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ ససాక్ష్యాలతో బయటకు రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.