కమల దళంలో అంతర్మథనం.. కొత్త శకానికి శ్రీకారం?

Publish Date:Apr 22, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక  లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. నిజానికి పైకి కనిపిస్తున్నడానికి లోపల జరుగతున్న పరిణామాలకు పొంతనలేదని అంటున్నారు.

 అవును ఢిల్లీలో చోటు  చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  భవిష్యత్ లక్ష్యాలు, భవిష్యత్ వ్యూహాలు ఆధారంగా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో అనివార్యంగా  చేపట్టవలసిన  పెను మార్పులపై లోతైన చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే  పైకి అంతా బాగుందన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఒకదానితో ఒకటి ముడి పడిన కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు.  ఇటీవల  అటు ఢిల్లీలో ఇటు నాగాపూర్ లో అగ్రనేతల వరస సమావేశాలు కేవలం పార్టీ అధ్యక్షుని ఎన్నికకు పరిమతం కాదని.. అంతకు మించిన అంతర్మధనం జరుగుతోందని  విశ్లేషకులు అంటున్నారు. 

ముఖ్యంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగపూర్ పర్యటన (మార్చి30) తర్వాత, చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయని, అంటున్నారు.  అలాగే  బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాల విషయంలోనూ పునఃసమీక్ష జరుగుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండగను పురస్కరించుకుని, సంఘ్ పరివార్ ఎజెండాలో మిగిలి  ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ బావిస్తోందని అంటున్నారు .అందులో భాగంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన కూడా నాగపూర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేలా,  ఢిల్లీ పై నాగపూర్ పట్టు బిగిస్తోందని అంటున్నారు. 

మళ్ళీ ఉప ప్రధాని?

 ఈ నేపధ్యంలో  రానున్న రోజుల్లో ఇటు బీజేపీలో, అటు ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయని, అంటున్నారు. ఇందులో భాగంగా, గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్న ఉప ప్రధాని పదవిని పునరుద్దరించే ఆలోచన ఉందని అంటున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న అద్వానీకి  2002లో ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే   పదోన్నతి లభించిందనీ, ఇప్పడు కూడా, ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే మళ్ళీ  ఉప ప్రధాని పదవిని పునరుద్దరించాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..  అప్పటిలాగా ఇప్పడు కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు పదోన్నతి లభిస్తుందా? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలలో ఒకరిని అదృష్టం వరిస్తుందా? అన్నది   తెలియాల్సి ఉందంటున్నారు.  నిజానికి, ప్రస్తుతం  బీజేపీ ముందున్న ప్రధాన సమస్య, ప్రధాన చిక్కు ముడి ఇదే అంటున్నారు.

ఈ రోజు  ఉప ప్రధాని రేపటి  ప్రధాని?

అవును. 2002లో ఉప ప్రధానిగా పదవిని చేపట్టిన అద్వానీ, 2004 ఎన్నికలలో  బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అద్వానీని బీజేపీ, ఎన్డీఎ కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. సరే.. ఆ ఏన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ బండి తిరగబడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఎ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. తిరిగి 2009 లోనూ ఆయనే ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ బరిలో దిగింది. అయితే మళ్ళీ అదే ఫలితం ఎదురైంది. అద్వానీ మరోసారి బస్సు మిస్సయ్యారు.   అది వేరే విషయం.  అదలా ఉంచితే, ఇప్పడు మళ్ళీ అదే ఆనవాయితీ కొనసాగితే, ఈ రోజు ఉప ప్రధాని ఎవరైతే వారే రేపటి (2029) ప్రధాని అభ్యర్ధి అవుతారు. అందుకే. పార్టీలో  ఇంతటి అంతర్మథనం సాగుతోందని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, మోదీ సహా చాలా మంది సీనియర్లు తెరమరుగు అవుతారని, కొత్త తరం తెరపైకి వస్తుందనీ,  కమల దళంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.