వైసీపీ నుంచి జంపింగుల జాబితాలో విజయసాయి రెడ్డి కూడా?

Publish Date:Dec 12, 2024

Advertisement

అందరూ అనుకున్నదే జరుగుతోంది. వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీకి తగిన శాస్తి జరుగుతోంది. ఐదేళ్ల అరాచక పాలన ఫలితం కర్మ రూపంలో ఇప్పుడా పార్టీని ఖాళీ చేస్తోంది. ఇంకా జగన్ తో కలిసి నడిస్తే పుట్టగతులుండవన్న భయంతో ఇంత కాలం జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు కూడా జాగ్రత్తపడుతున్నారు. జగన్ కు దూరం జరుగుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీల్లోని ఏదో ఒక పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీలోనూ అవకాశం లభించకపోతే.. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి.. తరువాతెప్పుడో అవకాశం చూసుకుని ఏదో ఒక పార్టీ పంచన చేరుదాం అన్న ఉద్దేశంతో వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, నేతలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి  మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు.

మాజీ మంత్రి అందతి శ్రీనివాస్ వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదనీ, జగన్‌ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందనీ, కొత్త ప్రభుత్వంపై మొదటి రోజు నుంచే దాడి కరెక్ట్ కాదనీ, కూటమి ప్రభుత్వానికి ఏడాదైనా టైమ్‌ ఇవ్వాల్సిందనీ అన్నారు. అక్కడితో ఆకకుండా   కూటమి సర్కార్‌ పాలన భేషుగ్గా ఉందంటూ పోగడ్తలు గుప్పించారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు, మాజీ ఎమ్మెల్యే   గ్రంధి శ్రీనివాస్‌ కూడా జగన్ పై, వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   జగన్ కోటరీకి తాను ఎదగడం ఇష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తే పవన్‌ను పెద్ద నాయకుడిని చేసినట్టు అవుతుందని భావించి మంత్రి పదవి ఇవ్వలేదని గ్రంధి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరూ కూడా తాము ఏపార్టీలో చేరతామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. 

అదలా ఉంచితే... జగన్ మరో భారీ షాక్ కు సిద్ధమవ్వాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ సీనియ ర్ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడు, వైసీపీలో ఒకప్పటి నంబర్ 2 నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జగన్ కు, వైసీపీకీ గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారు. రాజకీయవర్గాలు, పరిశీలకులు మాత్రమే కాదు, వైసీపీ వర్గాలు సైతం విజయసాయి వైసీపీని వీడేందుకు సిద్ధమౌతున్నారని అంటున్నారు.   2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే..అందుకు విజయసాయి పోషించిన కీలక పాత్ర విస్మరించలేనిది. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్‌షా, బీజేపీ అగ్ర‌ నేత‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య మంచి సంబంధాలు ఉండేలా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పారు విజయసాయి. విజ‌య‌సాయి రెడ్డి కృషితోనే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యానికి బీజేపీ స‌హ‌కారం అందించింద‌ని వైసీపీలోని ప‌లువురు నేత‌లు గ‌తంలో బాహాటంగానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అధికారం కోల్పోయిన త‌రువాత కూడా బీజేపీ అగ్ర నేత‌లు, జ‌గ‌న్ కు మ‌ధ్య విజ‌య‌సాయి రెడ్డి రాయ‌భారిగా ఉంటూ ముఖ్య‌మైన ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగు తున్నది. ముఖ్యంగా ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ద్వారా ఎదుర‌య్యే ఇబ్బందుల నుంచి కేంద్రంలోని బీజేపీ అగ్ర‌నేత‌లు జ‌గ‌న్‌కు, త‌న‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచేలా  విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయితే  ఇదే స‌మ‌యంలో కౌపీన సంరక్షణార్దం అన్నట్లుగా జగన్ లో కలిసి నడిచి నిండా మునిగిపోవడం కంటే ఆయన వదిలేసి సేఫ్ గూటికి చేరడానికి సైతం విజయం సాయి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నేపథ్యంలో విజయసాయి.. జనసేన అయితే తనకు సేఫ్ హౌస్ అవుతుందని భావిస్తున్నారని, అందుకే  బీజేపీ పెద్దలతో తన కున్న సంబంధాల ద్వారా జనసేనలోకి దూకేయడానికీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.  

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కాక‌ముందు.. సీఎం అయిన త‌రువాత కొద్దిరోజులు ఆయ‌న‌కు రైట్ హ్యాడ్‌గా ఉన్న విజ‌య‌ సాయిరెడ్డికి ఆ తరువాత పార్టీలో ఆ ప్రాధాన్యత లేకుండా పోయింది.   అంత‌కుముందు అక్ర‌మాస్తుల కేసుల్లో జగన్ తో పాటు విజయసాయి కూడా జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే, జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంవ‌త్స‌రం త‌రువాత క్ర‌మంగా విజ‌య‌సాయిరెడ్డిని దూరం పెడుతూ వ‌చ్చారు. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లను జ‌గ‌న్‌ పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని అప్ప‌ట్లో వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

విజ‌య‌సాయి రెడ్డి ఓ మీడియా ఛాన‌ల్ పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేయడం,  కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో త‌న‌కున్న సంబంధాల ద్వారా మీడియా ఛాన‌ల్ ఏర్పాటుకు కావాల్సిన ప్ర‌క్రియ‌ను మొదలు పెట్టడమే జగన్ రెడ్డి ఆగ్రహానికి కారణం అంటారు. పార్టీకి సొంత మీడియా ఉండ‌గా.. మ‌రో మీడియా ఛానెల్‌ పెట్టేందుకు విజ‌య‌సాయిరెడ్డి చేసిన ప్ర‌య‌త్నాల‌ను జ‌గ‌న్‌ తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతోపాటు.. బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ప‌లుసార్లు త‌న‌కు తెలియ‌కుండానే ర‌హ‌స్యంగా విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశం కావ‌డం ప‌ట్ల‌ జ‌గ‌న్ అప్ప‌ట్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారని చెబుతారు‌. అప్ప‌టి నుంచే విజ‌య‌సాయిరెడ్డిని జ‌గ‌న్ దూరం పెట్టార‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు. అయితే, ఎన్నిక‌ల‌కు సంవ‌త్స‌రం ముందు నుంచి మ‌ళ్లీ జ‌గ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గ‌ర‌య్యారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వంలో జరిగిన అవినీతి, అక్ర‌మాల‌పై కొర‌డా ఝుళిపిస్తోంది. ఈ క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన కేసులు, రాస‌లీలల వ్య‌వ‌హారాలు అనేకం వెలుగులోకి వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌, ఆయ‌న సొంత మీడియా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న ఆగ్ర‌హంతో విజ‌య‌సాయిరెడ్డి ర‌గిలిపోయాడు. దీనికితోడు తాజాగా అరబిందో పేరుతో ఏపీలో చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో విజ‌య‌సాయిరెడ్డి కీల‌క సూత్ర‌దారిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెండ్‌, కాకినాడ సెజ్‌లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాల‌ను క‌ర్నాటి వెంక‌టేశ్వ‌ర‌రావు (కేవీ రావు) నుంచి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌ల‌వంతంగా లాగేసుకున్నారంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అర‌బిందో య‌జ‌మాని పెన‌క శ‌ర‌త్ చంద్రారెడ్డి,  వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిపైనా సీఐడీ కేసు న‌మోదు చేసింది. దీనికితోడు వారు విదేశాల‌కు వెళ్ల‌కుండా లుక్ అవుట్ స‌ర్క్యూల‌ర్ (ఎల్‌వోసీ) జారీ చేసింది. త్వ‌ర‌లో విజ‌య‌సాయిరెడ్డి క్రిమిన‌ల్ రాజ‌కీయానికి సంబంధించి మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి రాబోతున్నాయ‌ని, ఆయ‌న శాశ్వ‌తంగా జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున మొదలైంది. దీంతో విజ‌య‌సాయిరెడ్డి కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శరణు కోరారు. ఇటీవల విజయసాయి అమిత్ షాను క‌లిసి త‌న‌ను కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని వేడుకున్నార‌నీ, ఆయన సూచన మేరకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవడానికి విజ‌య‌సాయిరెడ్డి నానా పాట్లూ పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఎక్స్  వేదిక‌గా సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విజయసాయి ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు. ప‌వన్‌కు జాతీయ స్ధాయిలో ప్రజాదరణ ఉందనీ  ఏపీకి నాయకత్వం వహించడానికి  పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అని తాను భావిస్తున్నట్లు  విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేవలం అంతటితో ఆగకుండా... ఏపీలోని  కూటమి నాయకుల్లో పవన్ అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి  అని సాయిరెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. ఏపీ వంటి కొత్త రాష్ట్రానికి  ఏడుపదుల వయస్సు పైబడిన చంద్రబాబు నాయకత్వం కంటే   పవన్ వంటి యువ నాయకత్వం అవసరమని సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  తాను జ‌న‌సేన పార్టీలో చేరుతాననీ, త‌న వెంట భారీ ఎత్తున వైసీపీ నేత‌లు సైతం జ‌న‌సేన‌లో చేరుతార‌ని విజ‌య‌సాయిరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్దకు రాయ‌బారం న‌డుపుతున్నార‌ని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి‌.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.