ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే..తమిళనాడు సీఎం విజయ్ క్లారిటీ.!
Publish Date:Sep 1, 2026
Advertisement
తమిళనాట మిత్రపక్షాలుగా ఉన్న టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలకు, సంక్షోభానికీ కారణమైన ప్రధాని అభ్యర్థి వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ వివాదానికి స్వయంగా టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ ముగింపు పలికారు. ఇటీవల ఇండియా టుడే, సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే విషయంలో సర్వే ప్రకారం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో విజయ్ నిలిచారు. జాతీయ స్థాయి అగ్రనేతలను దాటుకుని విజయ్ కు దేశవ్యాప్తంగా జనం భారీగా మద్దతు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ ను విస్మయ పరిచింది. అయితే.. ఈ సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడులో పొత్తులో ఉన్న కాంగ్రెస్, టీవీకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని రేసులో విజయ్ ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా సవాల్ చేస్తున్నారన్న ప్రచారం మొలైంది. టీవీకే కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ ను జాతీయ నేతగా ప్రాజెక్ట్ చేస్తూ, భావి ప్రధాని అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ఆరంభించారు. దీంతో కాంగ్రెస్, టీవీకేల పొత్తుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ వివాదానికి తెర దించుతూ విజయ్ ఇండియా కూటమి ప్రదాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అన్న స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు. కాంగ్రెస్ - టీవీకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కూటమి పొత్తులు దృఢంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
[Vijay Clarity on PM Candidate, Tamilnadu Cm Vijay, Rahul Gandhi, TVK Congress Rift, Mood of the Nation Survey, PM Face INDIA Bloc, Telugu One]
http://www.teluguone.com/news/content/vijay-clarity-on-pm-candidate-39-230389.html




