ఔను నిజమే.. విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టారు.. కన్ ఫర్మ్ చేసిన కోటంరెడ్డి.!
Publish Date:Sep 1, 2026
Advertisement
వైసీపీ అంతర్గత వ్యవహారాలు, అగ్రనేతల మధ్య విభేదాలను తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు. గతంలో వైసిపి ప్లీనరీ సమావేశాల వేదికగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి మధ్య జరిగిన గొడవలు వాస్తవమేనంటూ సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి నాడు మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సందర్భంగా వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 2022 లో మంగళగిరి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీలో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. ప్లీనరీ సమావేశాల విశ్రాంతి గదిలో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టారని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు విజయసాయిరెడ్డిపై ఎలాంటి ప్రేమా లేదంటూ.. అక్కడ నిజంగా ఏంజరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసిన విషయం పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్న ఆయన.. వైసీపీ అధినేత జగన్ కు కూడా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసన్నారు. అప్పట్లో విజయసాయి, సజ్జల మధ్య నడిచిన ఆధిపత్య పోరుకు సంబంధించి రానున్న రోజులలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక వైసిపి నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కూడా జగన్ మోహన్ రెడ్డే అంటూ ఆ క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ.. అక్టోబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవు తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నిధులు తీసుకురావాలన్నసంకల్పంతో ఉన్నారనీ, వైసీపీయులే.. ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుపడు తున్నారని విమర్శించారు. విశాఖపట్నం తరహాలోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కేసులోనూ కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
[Kotamreddy Sridhar Reddy confirms vijaya sai allegation, Sajjala Ramakrishna Reddy Beat vijayasai, YCP Plenary Clashes, AP Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/kotamreddy-sridhar-reddy-confirms-vijaya-sai-allegation-39-230395.html





