హర్యానా అధికారులలో విజిలెన్సు వణుకు

Publish Date:Jul 16, 2022

Advertisement

అవినీతి సర్వాంతర్యామి.. ఇందు గలదు అందు లేదను సందేహం వలదు.. అయినా,  అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయడమే కానీ, పట్టు పట్టి, తుడిచేసే ప్రయత్నం సహజంగా, ఏ ప్రభుత్వమూ చేయదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీని జోలికి వెళ్లేందుకు, ఏ ముఖ్యమంత్రీ సాహసించరు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వెళితే, ఏమవుతుందో అనుభవపూర్వకంగా తెలిసిన రాజకీయ పెద్దలు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల జోలికి మాత్రం వెళ్ళకు, వెళ్ళావో నిన్ను ఇంటికి పంపిస్తారని, రాజకీయ  వారసులకు, జూనియర్  నాయకులకు సలహాలు ఇస్తుంటారని అంటుంటారు.

 అయితే అందుకు విరుద్ధంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర లాల్ ఖట్టార్, (బీజేపీ)   ప్రభుత్వం, అవినీతిపై ఏకంగా పెద్ద యుద్ధాన్నే ప్రకటించింది.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి పచ్చిన ఫిర్యాదుల విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు పూర్తి  స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో విజిలెన్స్ అధికారులు.. ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.వల.. కాదు .. వలలు విసిరారు, ఏకంగా  83 మంది గవర్నమెంట్ ఉద్యోగులను అరెస్టు చేశారు. కౌంట్ ఇంకా  కొనసాగుతోంది.

ఇంకో విశేషం ఏమంటే, అరీస్ట్ అయిన వారిలో గుమస్తా చేపలే కాదు, గెజిటెడ్ చేపలు ఉన్నాయని, విజిలెన్స్ అధికారుల సమాచారం. డిప్యూటీ ఎక్సైజ్, టాక్సేషన్ కమిషనర్‌ను కూడా బ్యూరో అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. అలాగే, అరెస్టయిన వారిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన 18 మంది పోలీసు సిబ్బందికి చెందిన 23 మంది, విద్యుత్ శాఖకు చెందిన 15 మంది, పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన 8 మంది, ఎక్సైజ్, పన్నుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నారు.

ఈ అందరినీ కూడా, రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకూ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నమని  హర్యానా విజిలెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగం అంటేనే, జీతం ప్లస్ నిజానికి అందరికీ కాకపోయినా లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులు  జీతం పై కంటే ‘ప్లస్’ పైనే ఎక్కువ మక్కువ చూపుతారని అంటారు. చేతులు తడిపే పోస్టుల కోసం పోటీ పడతారు. రాజకీయ నాయకుల చేతులు తడుపుతారు. అంతకు పదితలు సంపాదించుకుంటారు. ఏ చిన్న పని చేయలన్నా, అది వారి బాధ్యతే అయినా, చేతులు చాపడం అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కామన్ అయిపొయింది. అయితే, ఇప్పుడు హర్యానాలో మాత్రం లంచం ఇస్తామన్నా పుచ్చుకునేందుకు ఉద్యోగులు భయపడుతున్నారట. భయంతో వణికిపోతున్నారట. అంటే కాదు హిట్ లిస్టులో ప్రముఖంగా ఉన్న అధికారులు అయితే సెలవులు పెట్టీ మరీ వెళ్లిపోతున్నారు.

అదలా ఉంటే హర్యానా ప్రభుత్వం, లంచమ డిగే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు  హర్యానా విజిలెన్స్ బ్యూరో 1800-180-2022, 1064 టోల్ ఫ్రీ  నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఎప్పుడో  ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు.. కానీ, ఆ ఫోన్ .. మొదటి కాల్  నుంచి ఇప్పటి వరకు ముగానోములోనే ఉందని,  మౌనవ్రతం చేస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.