ట్విటర్ తాతా.. వాస్తవం గ్రహించు!
Publish Date:Jul 16, 2022
Advertisement
భారీ వర్షాలు తెరిపిలేకుండా పడుతున్నపుడు పట్టణాల్లో, గ్రామాల్లో రోడ్లు నీటికుంటలుగా మారడం చాలా సహజం. ఇది చాలాకాలం నుంచి అందరికీ తెలిసినది, చూస్తున్నదీను. ప్రస్తుతం వర్షాల దెబ్బకి రోడ్లు మరీ దెబ్బతిన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లమీదకి నీరు చేరుకుపోయి కొన్ని ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితుల్లో జనాలు వున్నారు. ఇవన్నీ సామాన్య జనానికి తెలిసినదానికంటే సీఎంకి, నాయకు లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియకా కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వర్షాలకు రోడ్లు బాగా పాడయ్యా యి. చాలాకాలం నుంచి రోడ్లు విస్తరణ, వాటిని మరింత బాగుచేయాల్సిన అవసరం వుందని ప్రజలతో పాటు సంబంధిత అధికారులు గోడు పెడుతూనే వున్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూనే వచ్చిం ది. ఇపుడు ఈ దుస్థితికి వదిలేసింది. అయ్యా ఇవి మన రోడ్లే అని వీడియో తీసి చూపుతున్నా అబ్బే అబ ద్దాలు, మన రోడ్లు మరీ ఇంత దారు ణంగా పాడవలేదని ట్విటర్ తాత విజయసాయి రెడ్డిగారి ఉవాచ. ఇంత కంటే హాస్యాస్పదం మరోటి వుంటుందా? మా మాట కాదు ప్రజల మాటా వినకుంటే ఎలా విజయసాయీ అంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. మరీ విడ్డూరమేమంటే గుంటల్లో చిక్కుకుని ప్రమాదానికి గురయిన బండి తెలంగాణాకి సంబంధించినద నడం. పైగా ఆఫోటో నిజామాబాద్‌లో ఎప్పుడో జరిగినదని దాన్ని ఇపుడు ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రదర్శిస్తున్నారని ట్విటర్ తాతగారు ఆగ్రహించడం మరీ దారుణం. ఆటో ప్రమాదం తూర్పు గోదా వరి జిల్లా రాజమండ్రి కి చెందిన పొన్న వీరబ్బు ది అని అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని రిపేర్ ఖర్చులకి 15000 వరకు అవ్తుందని డ్రైవర్ గోల పెడుతున్నాడు. చిత్రమేమంటే, ఆటో ప్రమాదం రహదారి లో ఉన్న గుంటల వల్ల జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తుంటే, తెలంగాణా నిజామాబాద్ లో గుంటలు టి.డి.పి. వాళ్ళే తవ్వుతున్న రేమో అని తప్పు డు ఆరోపణలు చేసిన ట్విట్టర్ తాత ని ఎవరు క్షమిస్తారు. ప్రమాదం జరిగినది ఎక్కడో తెలియకుండానే ఫోటోలతో సహా చూపుతారా? ఆ ప్రాంతం ఆంధ్రానో, తెలంగాణానో తెలియని స్థితిలో ప్రజలు లేరన్నది విజయసాయి రెడ్డి తెలుసుకోవాలి. అయినా లేనిదాన్ని ఉంది అని ఉన్న దాన్ని లేదు అని చూపించడం లో ఈ ట్విట్టర్ తాత సిద్దహస్తుడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/twitter-grandpatoo-much-25-139894.html





