అజ్ణాతంలో విడదల రజిని.. అరెస్టు భయమే కారణమా?

Publish Date:Sep 8, 2024

Advertisement

తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. వైసీపీలోకి జంప్ చేసిన విడదల రజని ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై అవినీతి వటవృక్షంగా ఎదిగారు.   సైబ‌రాబాద్ మొక్క‌నంటూ తెలుగుదేశం పార్టీ  ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన విడద‌ల ర‌జ‌నీ..  వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్రబాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే కొద్దికాలంకే తెలుగుదేశం పార్టీని వీడి  వైసీపీలో చేరిపోయారు.  ఆ త‌రువాత అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని  పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. త‌ద్వారా వైసీపీ హ‌యాంలో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రెండున్న‌రేళ్లు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో విడుద‌ల ర‌జ‌నీ, ఆమె అనుచ‌రులు పెద్దెత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌టం, ఆమె మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల ఆమె అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విడుద‌ల ర‌జనీ అవినీతి అక్ర‌మాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. అధికారంలో ఉన్న స‌మ‌యంలో తెగ హ‌డావుడి చేసిన ఆమె.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదు. గ‌త నెల రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌జ‌నీ అందుబాటులో లేర‌ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అవినీతి గుట్టు వీడుతుండ‌టంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని.. బీజేపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.   టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వంలో న‌మోదైన కేసులూ మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో  తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దాడిచేశారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. పోలీసులకు పిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ కేసుపై దృష్టి సారించింది.. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్​, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు  చేసిన పోలీసులు.. మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుతో గ‌త ఐదేళ్లు పొలిటికల్‌ స్ర్కీన్‌పై ఓ వెలుగు వెలిగిన నేతలు.. ఉన్నపళంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్ వంటివారు అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోగా, మాజీ మంత్రి విడదల రజిని కూడా వారి బాటనే అనుసరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వైసీపీ హయాంలో విడదల రజనీ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేకాక‌.. ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీ అవినీతి అక్ర‌మాల‌పై పోలీస్ స్టేష‌న్‌ల‌లో ప‌లు కేసులు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఆ కేసుల‌పై దృష్టి సారించిన అధికారులు.. ర‌జ‌నీని త్వ‌ర‌లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.  

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ర‌జ‌నీ.. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ త‌రువాత క్ర‌మంలో ర‌జ‌నీని ప‌లు వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె నియోక‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. స్థానిక‌ వైసీపీ నేతలు కూడా గతంలో జగన్ మోహ‌న్ రెడ్డికి ర‌జ‌నీపై ప‌లుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా జ‌గ‌న్ చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేయ‌డంతో విడద‌ల‌ ర‌జ‌నీ మ‌రింత రెచ్చిపోయార‌ని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది.

జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ర‌జ‌నీని పోటీకి దింపితే ఆమె ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని తేలింది.  దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఆమెను గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి మార్చారు. అయితే, ఆ ఎన్నికలలో రజనీ   ఓట‌మి పాల‌య్యారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. చిలక‌లూరిపేటలో విడదల ర‌జ‌నీ భూ దందా వెలుగు చూసింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటీ 16 లక్షల రూపాయల కమిషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారని తెలిసింది. 

ఎన్నికల ముందు చిలక‌లూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని తన వద్ద విడద‌ల ర‌జ‌నీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి రాజేశ్‌ నాయుడు ఆరోపించారు. గ‌తంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చేయ‌గా.. ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం రాజేశ్‌నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  ఆయన ర‌జ‌నీకి గ‌ట్టి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నార‌ట‌. మరో వైపు చిలక‌లూరిపేట స్టోన్‌ క్రషర్‌ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.   క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు   ఇవ్వాలని రజిని డిమాండ్‌ చేశారని, లేదంటే 50 కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్‌ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో విడుదల‌ రజినీపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధంచేస్తున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. త‌ర్వాత జైలు కెళ్లే వైసీపీ నేత మాజీ మంత్రి ర‌జ‌నీ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. మ‌రోవైపు.. విడుద‌ల ర‌జ‌నీ మాత్రం త‌న‌ను చుట్టుముడుతున్న కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వైసీపీ నేతలు అంటున్నారు.  మొత్తం మీద రజనీ అవినీతి, అక్రమాల గుట్టు రట్టౌతుండటంతో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది.
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది.
జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.
తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌.
జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది.
  తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది.  మద్యానికి బానిసలైన  కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు.
భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు
కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.