గెలుపు దోబూచులాట.. లక్నో జయింట్స్ దే విజయం

Publish Date:Apr 9, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా  గురువారం (ఏప్రిల్ 9) రాత్రి జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.  మ్యాచ్ లో విజయం చివరి వరకూ ఇరు జట్లతోనూ దోబూచులాట ఆడింది. అయితే చివరకు లక్నో బ్యాటర్ అద్భుత బ్యాటింగ్ పుణ్యమా అని ఓటమి అంచుల నుంచి  గెలుపు బావుటా ఎగుర వేసింది లక్నో జయంట్స్. ఓటమి ఖాయమని పరిస్థితిలో యువ ఆటగాడు ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చి మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ హోరాహోరీ పోరులో లక్నో 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. స్కిప్పర్ అజింక్యా రహానే 41 పరుగులు, రఘువంశి 45 పరుగులతో రాణించారు. చివరిలో రోవ్మన్ పావెల్ 39 పరుగులు సాధించడంతో కోల్ కతా 181 పరుగులు  చేయగలిగింది. 

ఇక 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జయింట్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మార్ష్ 15 పరుగులు, మార్కరమ్ 22 పరుగులు, రిషబ్ పంత్ డకౌట్ తో త్వరగానే ఔటు కావడంతో లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీ సాధించి లక్నోకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే 54 పరుగులు చేసిన బదోనీ కీలక సమయంలో అవుట్ కావడంతో  లక్నో జయింట్స్ మళ్లీ కష్టాల్లో పడింది. ఇక గెలుపు అసాధ్యమన్న పరిస్థితిలో పడింది. సరిగ్గా ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చాడు ముకుల్ చౌదరి. ఓటమి అంచుల్లో ఉన్న లక్నో జయింట్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు.   27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించాడు. చివరి ఓవర్ లో విజయానికి 14 పరుగులు అవసరం అయిన దశలో వైభవ్ ఆరోరా వేసిన ఆ ఓవర్లో ముకుల్ చౌదరి రెండు సిక్సర్లు బాది లక్నోకు విజయాన్ని అందించాడు.   

ఈ విజయం లక్నో శిబిరంలో ఆనందాన్ని నింపింది.  మ్యాచ్ ముగిసిన తరువాత లక్నో జయంట్స్ యజమాని సంజీవ్ గోయెంకా స్వయంగా మైదానంలోకి వచ్చి ముకుల్ చౌదరిని అభినందించాడు. అతని బ్యాటింగ్ ను వేనోళ్ల పొగుడుతూ చాలా సేపు అతడితో ముచ్చటించారు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ముకుల్ చౌదరి క్రికెటర్ అవ్వాలన్నది తన తండ్రి కల అని చెప్పాడు 

By
en-us Political News

  
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.