కాంగ్రెస్ కలను వెంకయ్య నాయుడు సాకారం చేస్తారా?

Publish Date:Jan 31, 2013

Advertisement

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి మోడీ వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి అంటూ మీడియాలో వార్తలు వస్తున్ననేపద్యంలో, మొన్నఆయన కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి డిల్లీ రావడం ప్రాదాన్యతని సంతరించుకొంది. మూడు నాలుగు గంటలకు పైగా సాగిన వారి సమావేశం అనంతరం, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అయన అభ్యర్దిత్వం గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడకపోయినప్పటికీ, మీడియాతో మోడీకు అనుకూలంగానే మాట్లాడారు.

 

ఆ మరునాడే, ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా మోడీ అభ్యర్దిత్వాన్ని సమర్దిస్తూ మాట్లాడారు. తరువాత, బీజీపీ నుండి సస్పెండ్ చేయబడ్డ రామ్ జేత్మలానీ కూడా మోడీ లౌకికవాది, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం మంచిదని అన్నారు.

 

అయితే, పార్టీ ఇంతవరకు మోడీ అభ్యర్దిత్వాన్నిఖరారు చేయనప్పటికీ, అప్పుడే ఆయనకు వ్యతిరేఖంగా మరోవర్గం ప్రచారం మొదలు పెట్టింది. పార్టీలో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయడు నిన్న మీడియా వారితో మాట్లాడుతూ “అద్వాని, నేను, సుష్మ స్వరాజ్ తో సహా పార్టీలో చాలామందే ప్రధాని పదవికి అర్హులయినవారున్నారు. కానీ, ఈ విషయం గురించి పార్టీలో చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.

 

భారతీయ జనతాపార్టీ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఆ పార్టీని వచ్చేఎన్నికలలో నరేంద్ర మోడీ తప్ప మరొకరు గట్టేకించలేరు అని వారికీ తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ను అవలీలగా ఓడించి డిల్లీ పీటాన్ని కైవసం చేసుకోగలమని వారు నమ్ముతున్నారు.

 

కానీ, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీ నేతృత్వంలో, అతనిని తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నిలిపి ముందుకు సాగాలనుకొంటునందున ఆ పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపనిచేస్తుంది. అటువంటప్పుడు, దేశ వ్యాప్తంగా మంచి పేరు పొంది, రాహుల్ గాంధీని దీటుగా ఎదుర్కోగల నరేంద్ర మోడీని కాదనుకొని, ఏంతోకాలంగా ప్రధాన పదవిని అధిష్టించాలని ఆశపెట్టుకొన్న వయసుమీరిన లాల్ కృష్ణ అద్వానీ, లేదా ఏవిధమయిన ప్రత్యేకత లేని వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలను ముందుంచుకొని భారతీయ జనతా పార్టీ గనుక ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో వేరేగా చెప్పనవసరం లేదు.

 

నిజం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ కాకుండా వేరేవరయినా ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తనకీ లాభం అని కోరుకొంటోంది. కాంగ్రెస్ కోరికని వెంకయ్య నాయుడు వంటి వారు సాకారం చేస్తారేమో చూడాలి మరి.

By
en-us Political News

  
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.