వెంకట్రామరెడ్డి జగన్ భక్తికి ఫలితం దక్కుతోందిగా?

Publish Date:Aug 22, 2024

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారుల తీరు హ‌ద్దులు దాటిపోయింది.   కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల్లా వ్యవహరించారు. త‌మ స్వ‌లాభం కోసం  ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌స‌న్నంకోసం కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు ఎంతకైనా  తెగించేశారు. పాతాళానికి దిగజారిపోయారు.  ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పొగిడేందుకే మ‌నం ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్న‌ట్లుగా కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు వ్య‌వ‌హ‌రించారు.  వారి తీరుపట్ల ఉద్యోగులే కాదు ప్ర‌జ‌లు కూడా విస్తుపోయారు.   ఆగ్రహంతో రగిలిపోయారు.  ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్నామ‌న్న సోయి  మ‌రిచి ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీకి కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రించిన వారిలో  సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ముందువరుసలో ఉన్నారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి  2022 డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీరు వివాదాస్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వ‌ద్ద‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల వద్దకు  ఉద్యోగుల సమ‌స్య‌ల‌ను తీసుకెళ్లి వాటి ప‌రిష్కారంకోసం కృషి చేయాల్సిన   ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రించారు.  

2014-19 మధ్య కాలంలో కూడా వెంకట్రామరెడ్డి జగన్ భక్త ఆంజనేయుడిగానే వ్యవహరించారు. జగన్ కు మద్దతుగా నిలవడం కోసం తన ఉద్యోగ ధర్మాన్ని కూడా ఉల్లంఘించారు. అప్పట్లో రహస్య పత్రాలను వైసీపీకి అందచేసి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎలాగోలా మళ్లీ ఉద్యోగంలో చేరినా ఆయన తీరు మారలేదు. జగన్ రాజకీయ ప్రవేశం చేసిన క్షణం నుంచీ ఆయన ప్రభుత్వోద్యోగిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా పని చేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జగన్ భక్తి ఉన్మాద స్థాయికి చేరింది. మరింతగా చెలరేగిపోయారు. 

అయితే జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు తన గత పాపాలు, తప్పులకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైంది. వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగ నేతగా ఎన్నడూ పని చేసిన పాపాన పోలేదు. జగన్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు.   జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా పదవి కూడా వచ్చింది. అయితే ఆయన తన సేవలన్నీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా, జగన్ కు ఊడిగం చేయడం కోసమే వినియోగించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. 

చివరాఖరికి ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పని చేయడంతో ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించి సస్పెన్షన్ వేటు వేసింది.  సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ిచన తరువాత ఆయనపై అభియోగాలు ఖరారు చేసి వివరణ ఇచ్చుకోవడానికి పక్షం రోజులు గడువు ఇస్తూ నోటీసు ఇచ్చింది.   ఆ విరణ తరువాత ఆయనపై చర్యలు తప్పవు. వెంకట్రామిరెడ్డిపై అభియోగాల తీవ్రతను బట్టి ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. అది వాస్తవం కూడా.. ప్రభుత్వోద్యోగిగా, సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఆయన చేసిన తప్పిదాలు, జగన్ భక్త ఉన్మాదంతో వ్యవహరించిన తీరు పరిగణనలోనికి తీసుకుంటే వెంకట్రామరెడ్డి డిస్మిస్ అవ్వడం ఖాయమని ఉద్యోగులే అంటున్నారు.  జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆయన ఉద్యోగులను నానా బాధలకూ గురి చేశారనీ, జగన్ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలను సమర్ధించారని  వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.