ఎమ్మెల్సీగా బొత్స.. ఉపయోగమేంటి?

Publish Date:Aug 22, 2024

Advertisement

విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. వైసీపీ సీనియర్ నాయకుడ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్ వేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో బొత్స ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం (ఆగస్టు21)న మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాదు మండలిలో ఆయననే విపక్ష నేతగా జగన్ నియమించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అది వేరే సంగతి. తన ప్రమాణ స్వీకారం అనంతరం బొత్స సత్యనారాయణ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా, కూటమి ప్రభుత్వంపైనా వైసీపీ మార్కు విమర్శలు చేశారు. అంతే కాకుండా వైసీపీ ప్రతిష్టను మరింత దిగజార్చడానికి మాత్రమే ఉపయోగపడేలా వైసీపీ విధానం మూడు రాజధానులేనని కూడా ప్రకటించేశారు.


అలాగే తెలుగుదశం కూటమి ప్రభుత్వం అక్రమంగా తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి వేధిస్తోందనీ, అయినా భయపడమని గంభీరంగా చెప్పారు. మండలిలో ప్రజా సమస్యలపై నిలదీస్తానని చెప్పుకున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామనీ చెప్పుకున్నారు. 

ఇంత వరకూ బాగానే ఉంది కానీ వాస్తవానికి అపార రాజకీయ అనుభవం, పలు మార్లు మంత్రిగా పదవులు వెలగబెట్టి, ఒక దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికకావడం గొప్ప విషయమేమీ కాదు, వాస్తవానికి ఎమ్మెల్సీగా బొత్స తనను తాను  దిగజార్చుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బొత్సకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపడం ద్వారా ఆయనను విశాఖలో పార్టీ నేతలకు దూరం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయ పరాభవాన్ని ఎదుర్కొన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. అదే విధంగా మండలి సమావేశాలకు కూడా వైసీపీ గైర్జాజర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. జగన్ అయితే అసెంబ్లీకి వెళ్లి తాము చేసేదీ చేయగలిగేదీ ఏమీ లేదని కుండబద్దలు కొట్టేశారు. విపక్ష హోదా ఇస్తే తప్ప సభలో అడుగు పెట్టనని తేల్చేశారు. విపక్ష హోదా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక మండలి సమావేశాలకు కూడా ఆ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. ఏదో ఇద్దరు ఎమ్మెల్సీలు మినహా  మిగిలిన వారంతా జగన్ బాటలోనే నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినా మండలిలో అడుగు పెడతారా? జగన్ అడుగు పెట్టనిస్తారా? అన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.