చెంగల తరువాత వంశీయేనా?

Publish Date:Sep 4, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీ ఇటీవల తన విధానాలు మార్చుకున్నా నేతల మనస్సు మార్చలేకపోతోంది. అలానే జనంలోనూ తెలుగుదేశం పార్టీ లేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే నొక్కిచెబుతున్నారు. ఎన్ని బీసి డిక్లరేషన్లు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మారితే కానీ, మార్పు రాని పరిస్థితి నెలకొందని కొందరు సీనియర్లు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి వలసలను ఆపటం కష్టమవుతోంది. విశాఖ జిల్లాలో అతిచిన్న నియోజకవర్గమైన పాయకరావుపేటకు చెందిన చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

 

 

 

టీవల ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వెంకట్రావు తాజాగా ఎదుర్కొన్న అవమానాలను దిగమింగుకోలేక రాజీనామా చేశానన్నారు. అక్టోబర్ 15న తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటానన్నారు. చెంగల వెంకట్రావు నందమూరి కుటుంబంతో మంచి అనుబంధమున్న తెలుగుదేశం నాయకుడు. ఒకసారి ఈయన ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన పరిస్థితుల్లో నందమూరి కుటుంబమే ఈయన్ని ఆదుకుంది. అంతేకాకుండా బాలకృష్ణకు వెంకట్రావుకు మంచి సంబంధాలున్నాయి. అసలు ఆ కుటుంబాన్ని సంప్రదించకుండా ఏ పని చేయని వెంకట్రావు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకట్రావును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంతగా ఆదరించారంటే ఇక పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ అంటే చెంగల అన్నంతగా ప్రాధాన్యత కల్పించారు. అలానే జిల్లా స్థాయి పార్టీ కార్యక్రమాల్లో వెంకట్రావు లేకపోతే బాబు ఊరుకునేవారు కాదని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటిది చెంగల పార్టీ మార్పు నిర్ణయం తీసుకోవటం విశాఖజిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్దదెబ్బ తగులుతుందని పార్టీవర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.

 


 

ఈ స్థానంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ తరుపున బాబురావు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరుపున చెంగల ప్రత్యర్థిగా ఉండేవారు. ఈ ఉపఎన్నికల్లోనే బాబురావు వై.కా.పా. తరుపున పోటీ చేసి మంచి మెజార్టీ సాధించారు. దీంతో ఈయన విజయం కూడా ప్రత్యర్థిగా పోటీపడుతూ వచ్చిన చెంగల మనస్సు మార్చటానికి ఉపయోగపడిరదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబురావు ఎన్నికల ఫలితాలే వెంకట్రావును ఆలోచింపజేసిందని ఆయన సన్నిహితులు కూడా విశ్లేషకుల అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. వైకాపాకు పునాది గట్టిదని నమ్మినందునే వెంకట్రావు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయపరిశీలకులు అంటున్నారు.



 ఏమైనా నందమూరి కుటుంబంతో సంబంధం ఉన్న చెంగల పార్టీ నుంచి బయటకువెళ్లేందుకు నిర్ణయం తీసుకోవటంతో గాలి మళ్లీ విజవాడ తెలుగుదేశం పార్టీవైపు మళ్లింది. చెంగల తరువాత నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండే కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆల్రెడీ వైకాపాలో కొనసాగుతున్నారు. ఈయన తరువాత తెలుగుదేశం పార్టీ విజయవాడ సిటీ కన్వీనర్ వల్లభనేని వంశీ కూడా వీలైనంత త్వరలో పార్టీ మారతారని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగే మూడో నేత వల్లభనేని వంశీ కావటంతో ఈయన ఖచ్చితంగా పార్టీ వదిలేస్తారని బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లా వారు, విశాఖ జిల్లా వారితో బస్తీమేసవాల్ అంటున్నారట. వంశీ కూడా పార్టీ మారకపోతే చూడండని కొందరు, సమస్యే లేదని మరికొందరు ఈ బెట్టింగుల్లో పాల్గొంటున్నారు.

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.