అధికారంకోసం చంద్రబాబు కొత్తపాట్లు!
Publish Date:Sep 4, 2012
Advertisement
ఒకనొకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని పిలిపించుకున్నారు. ఇప్పుడేమో అధికారం కోసం నానా అవస్ధలు పడుతున్నారు. తన తొమ్మిదేళ్ల పాలన ఓ అద్భుతమని ఆయన అనుకుంటున్నారు. అప్పటి కరువుకష్టాలను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. అయితే ఇటీవల బీసి డిక్లరేషను ప్రకటించి ఆ కులసంఘాలను తనవైపుకు తిప్పుకోవటం ద్వారా 49శాతం ఓటుబ్యాంకు మళ్లిందని అభిప్రాయపడుతున్నారు. వందస్థానాల్లో అవకాశమిస్తానని ఆయన బీసిలకు ఇచ్చిన భరోసా కూడా ఫలవంతమవుతుందని ఆశిస్తున్నారు. తాను ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే 2012 ఉపఎన్నికల్లో పార్టీ ఘోరంగా వోడిపోయిందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకని తాను, తన పార్టీ కార్యకర్తలూ ప్రజల్లో ఉండేందుకు 117రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన 2014 ఎన్నికలయ్యేటప్పటికి మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని తెలుగుదేశం శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీసబ్ప్లాన్పై దృష్టి సారించిన నేపథ్యంలో గిరిజనుల ఓటుబ్యాంకు సాధించుకునేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు. ప్రజల వద్ద 117రోజులు గడిపిన తరువాత బాబు రాష్ట్రస్థాయిలో బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ జనవరి 14వతేదీ అని కూడా ప్రకటించారు. పనిలోపనిగా అన్ని జిల్లాల్లోనూ మినీమహానాడు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. మిగిలిన స్థానాల్లో 58నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించటం ద్వారా పార్టీని కూడా పట్టిష్టం చేయాలని బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏమైనా ఈసారి మా చంద్రబాబు పక్కా ప్లానింగ్తో పర్యటిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/chandrababu-tdp-24-17133.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





