వైసీపీ కూరలో కరివేపాకు వంశీ?.. పొమ్మనలేక పొగ?

Publish Date:May 23, 2022

Advertisement

కేబినెట్ కూర్పు అయిపోయిందీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిపోయింది. ఆ వెంటనే గన్నవరం నియోజకవర్గం గ్రూపుల  గోలతో జగన్ ఆగమాగం అవుతున్నారు. దీంతో జగన్ కు గన్నవరం తలనొప్పిని వదిలించేందుకు వైసీపీలో సర్వ శాఖల మంత్రిగా ‘కీర్తి’ మూటగట్టుకున్న కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.

గన్నవరంలో గ్రూపుల గోలకు ఆద్యులైన  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావులను తాడేపల్లి ఫ్యాలెస్‌కు పిలిపించేందుకు నిర్ణయించారు. ముందుగా  ముందుగా దట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో సజ్జల భేటీ  అయ్యారు. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీ.. వైసీపీలో  లీడర్ నుంచి కేడర్ వరకు ఎవరెవరనీ.. ఎలా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందీ సాక్ష్యాధారాలతో సహా వివరించడమే కాకుండా, వైసీపీలో చేరిత తరువాత  వల్లభనేని వంశీ అనుసరించిన వైఖరిని సజ్జల ముందు వివరించారనిపార్టీ వర్గాల సమాచారం.

అంతే కాదు..దుట్టారామచంద్రరావు, ఆయన అల్లుడు సజ్జలతో భేటీ అయినంత సేపూ వంశీని కేబిన్ బయటే వెయిట్ చేయించారని, ఆ తరువాత వంశీకి పిలుపు వచ్చిందనీ, అయితే సజ్జలతో భేటీ నిముషాలలోనే ముగిసిపోయిందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సజ్జల వంశీకి ఇచ్చిన సందేశమేమిటన్నది తేటతెల్లమైపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసలు వంశీని సజ్జల తన కేబిన్ వద్ద వెయిటింగ్ లో పెట్టి.. లోపల ఆయన ప్రత్యర్థులతో సజ్జల మంతనాలు జరపడంతోనే  వల్లభనేనికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటన్నదని అర్ధమైపోయిందని రాజకీయ వర్గాలు  అంటున్నాయి. ఇక ఈ భేటీ తరువాత వంశీ వర్గం కుతకుతలాడిపోతోందని అంటున్నారు.

వల్లభనేని వంశీని అవమానించడమే కాకుండా, గన్నవరం నియోజకవర్గంలో ఆయనను ఒంటరి చేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదనీ ఆరోపిస్తున్నది. ఇక వైసీపీలో వల్లభనేని వంశీ సీన్ ముగిసి నట్లేనని చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ సతీమణి భారతికి సమీప బంధువు కావడం వల్లనే గన్నవరంలో వల్లభనేని వంశికి పొగపెడుతున్నారన్న టాక్ కూడా గన్నవరం నియోజకవర్గంలో ఓ రేంజ్ లో ప్రచారంలో ఉంది. అసలు తొలి నుంచీ కూడా వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీకి గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నేతలకు ఇష్టం లేకపోయినప్పటికీ, అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వల్లభనేనికి మద్దతుగా నిలబడి పార్టీలోకి ఎంట్రీకి మార్గం సుగమం చేశారని కూడా చెబుతున్నారు.  

ఇక వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆయనకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోందని, ఇది గమనించే ఆయనను పార్టీలో కొనసాగించడం వేస్ట్ అన్న అభిప్రాయానికి వైసీపీ నేతలు వచ్చేశారనీ, అందుకే వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ ప్రయత్నాలు తుది దశకు వచ్చేశాయనడానికి సజ్జల ఆయనతో వ్యవహరించిన తీరే నిదర్శనమని అంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.