Publish Date:Aug 11, 2023
రాజకీయాలు ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు.. క్షణం..క్షణం రంగు మార్చుకుంటుంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. గత 2014, 2019 ఎన్నికల్లో ఆయన పరిస్థితి నల్లేరుపై నడకగా మారిపోయింది. దీనికి కారణం.. బలమైన టీడీపీ కేడర్ అంతా కూడా ఆయన వెంటే ఉంది. ప్రజలు కూడా ఆయనను నమ్మారు.
స్థానికంగా కూడా టీడీపీని వంశీ డెవలప్ చేశారు. కేడర్‌ను పెంచుకున్నారు. యువతలో భరోసా నింపారు. దీంతో గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన అసలు ఎన్నికలను పెద్ద సీరియస్ గా కూడా తీసుకోలేదు. పరిటాల రవి దగ్గర తీసుకున్న ట్రయినింగ్ వంశీకి ఇప్పటిదాకా బాగానే ఉపయోగపడింది. మునుపు ఆయనకు పార్టీలోనూ ఎంతో ఇమేజ్ ఉండేది. తిరుగులేని నాయకుడిగా ఆయన ఒక ఊపు ఊపారు. అయితే.. ఆయన కోరి కోరి 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక వైసీపీ పంచన చేరిపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు ఇది ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా మాత్రం వంశీకి ఇది పూర్తి మైనస్ అయిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. తటస్థులు కూడా వంశీని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని.. అనేక ఆన్‌లైన్ చానెళ్లు చేస్తున్న సర్వేల్లో తేలి పోయింది. వంశీ అంటే ఎంతో గౌరవం ఉందని అంటున్న వారు కూడా.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేం.. అని అనేస్తున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి వంశీకి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయనే మా ఎమ్మెల్యే అని బల్లగుద్ది మరీ చెప్పిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా.. ఆయన ఉన్న వైసీపీలోనూ.. ఆయనకు ఎదురు గాలి వీస్తోంది. గతంలో ఆయన టీడీపీలో ఉంటే.. నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కానీ.. ఇప్పుడు వైసీపీలో ఆయనకు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం.. అధిష్టానంకు మాత్రమే ఎటూపాలుపోని పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం.. డెబ్బై శాతం వ్యతిరేకత కనిపిస్తోంది. అటు యార్లగడ్డ వెంకట్రావ్ .ఇటు దుట్టా.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన చెమట చిందించాల్సిందే అనే రాజకీయ పండితులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabaneni-vamshi-clean-bold-39-159820.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.