మీకు బైక్ లేదా కారు ఉందా? అయితే తెలంగాణ రవాణా శాఖ జారీ చేసిన ఈ సరికొత్త హెచ్చరికను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రాష్ట్రంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. మీ వెహికల్‌కు సంబంధించి వాహన్ (Vahan) డేటాబేస్‌లో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను అప్‌డేట్ చేయడానికి రవాణా శాఖ కేవలం నెల రోజులు అంటే 30 రోజుల గడువును మాత్రమే విధించింది. ఒకవేళ మీ పాత నెంబర్ మారిపోయి ఉంటే, వెంటనే కొత్త నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో భారీ పెనాల్టీలు మరియు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అసలు ఈ కొత్త నియమాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందనే సందేహం మీకు రావచ్చు. సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఆన్‌లైన్ ద్వారా ఈ-చలాన్ విధిస్తుంటారు. అయితే, చాలా మంది వాహనదారుల పాత మొబైల్ నెంబర్లు వాహన్ పోర్టల్‌లో ఉండటం వల్ల వారికి చలాన్ తాలూకు మెసేజ్‌లు వెళ్లడం లేదు. దీనివల్ల మాకు అసలు చలాన్ పడిన విషయమే తెలియదు అంటూ చాలా మంది వాహనదారులు పెనాల్టీలు కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఈ పెద్ద సమస్యకు పూర్తిగా చెక్ పెట్టడానికే రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు కలిసి ఈ జాయింట్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇకపై వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS) లేదా ఈమెయిల్ ద్వారా పంపిన చలాన్లు మీకు అధికారికంగా అందినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. నాకు మొసేజ్ రాలేదు, చలాన్ పడినట్లు నాకు తెలియదు అనే సాకులు ఇకపై అస్సలు నడవవని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. రవాణా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 1 నెల రోజుల డెడ్‌లైన్ ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్‌కే చలాన్ నోటీసులు పంపుతారు. ఒకవేళ మీ నెంబర్ తప్పుగా ఉండి మీకు మెసేజ్ రాకపోయినా, చలాన్ మీకు లీగల్‌గా డెలివరీ అయిపోయినట్టే లెక్కగడతారు.
దీనివల్ల వాహనదారులకు తెలియకుండానే పెనాల్టీలు భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు, వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదా ఇతర ఆర్‌టిఓ పనుల సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డిజిటల్ ఛానల్స్ ద్వారా చలాన్లను పంపడం వల్ల కాగితం వాడకం తగ్గడమే కాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కాబట్టి వెంటనే మీ వాహనానికి లింక్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్‌ను ఒకసారి ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకోండి. ఒకవేళ నెంబర్ మారితే, వెంటనే అధికారిక వాహన్ పోర్టల్‌లోకి వెళ్లి మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఈ నెల రోజుల్లోనే ఈ చిన్న పనిని పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఉండండి!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vahan-database-mobile-number-update-telangana-36-221631.html
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్‌ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
ఎలాన్ మాస్క్ స్పేస్‌ఎక్స్ (SpaceX) ఐపీఓ తర్వాత ఎస్‌అండ్పీ 500 (S&P 500) ఇండెక్స్‌లోకి ఎంట్రీ ఆలస్యం కానుంది. నిబంధనల సడలింపుకు నో చెప్పిన ఎస్‌అండ్పీ డౌ జోన్స్. స్పేస్‌ఎక్స్ నష్టాల లెక్కలు మరియు కఠిన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ మరియు వీసా నిలిపివేతపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూఎస్ ఫెడరల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 39 దేశాల వలసలపై విధించిన కఠిన ఆంక్షలను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయుల కోడింగ్ నైపుణ్యాలను మరియు ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందించారు. భారత్-రష్యా సహోదర బంధంపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇక్కడ చదవండి.
ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న పబ్లిక్ జీపీఎస్ (GPS) వ్యవస్థను అమెరికా మిలిటరీ రహస్యంగా ఒక గ్లోబల్ నంబర్స్ స్టేషన్‌లా మార్చేసిందనే షాకింగ్ నిజం శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. మన ఫోన్లలోకి వస్తున్న ఆ సీక్రెట్ కోడ్స్ కథేంటో ఇక్కడ చదవండి.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు ఊచకోత కోశారు. మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 33 వికెట్లు కూలడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ప్రతిరోజూ రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు! హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ₹150 కోట్ల స్కామ్, మరియు మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్ప్‌లైన్ 1930 ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని చెప్పిన 42 ఏళ్ల ముద్దునూరు మంజుల అనే మహిళపై, ఆమె కుమారుడిపై కొందరు యువకులు ఇల్లు చొరబడి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ కోసం మొదటి సరికొత్త రైలు సెట్ వచ్చేసింది. సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ మెట్రో లైన్ ట్రయల్ రన్స్, రూట్ వివరాలు, రియల్ ఎస్టేట్ మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 2024 ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా $60,000 మార్కు కిందకు చేరింది. క్రిప్టో పతనానికి గల ముఖ్య కారణాలు మరియు ఎథేరియం, సోలానా వంటి కాయిన్ల తాజా పరిస్థితి ఇక్కడ చదవండి.
భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల నుండి డబుల్ డిజిట్ (రెండంకెల) లాభాలను ఎలా సాధించగలదో ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ నిపుణులు అశ్విని షామీ వివరించారు. ముడి చమురు ధరల తగ్గింపు మరియు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన టాప్ 5 రంగాల గురించిన పూర్తి విశ్లేషణ మీకోసం.
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది. ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
భారత స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్ తాకుతున్నాయి. ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించారంటూ సెబి (SEBI) మోపిన సంచలన ఆరోపణలు, నిధుల మళ్లింపు వివాదం మరియు జెన్సాల్ ఇంజనీరింగ్ తో పోలికల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.