ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన... ఎందుకంటే!

Publish Date:Mar 28, 2016

Advertisement

 

గత వారం పదిరోజులుగా ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకి కేంద్రం ఓ అనూహ్యమైన ముగింపుని ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఇంకా మర్చిపోకుండానే, మరో రాష్ట్రంలోని ప్రభుత్వం నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయింది.

 

ఉత్తరాఖండ్‌లోని హరీశ్‌రావత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్‌బహుగుణ వంటి నేతలు ఆది నుంచీ గళం ఎత్తుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పనితీరు పట్ల వీరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించసాగారు. విజయ్‌బహుగుణకు హరీష్‌రావత్‌ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కలగడానికి కారణం లేకపోలేదు. 2012లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ తరఫున విజయ్‌బహుగుణను ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. కానీ రెండేళ్లు గడువకుండానే, ఆయన చేత రాజీనామా చేయించి... ప్రభుత్వ పగ్గాలను హరీశ్‌రావత్‌కు అప్పగించారు. ఇలా తరచూ ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ రోజులు మారుతున్నాయన్న విషయం గ్రహించలేకపోయింది.

 

గద్దె దిగిన ముఖ్యమంత్రిగా విజయ్‌బహుగుణ సహజంగానే అసంతృప్తితో రగిలిపోవడం మొదలుపెట్టారు. తన అసంతృప్తిని పార్టీ అధినాయకత్వానికి చేరవేసినా, వారి నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం వినిపించలేదన్నది ప్రధాన ఆరోపణ. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఇలాగే పట్టీపట్టనట్లు ఉందని ఆరోపణలు వినిపించాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిరసన గళమెత్తిన ఎమ్మెల్యేలు సోనియా, రాహుల్‌ గాంధిలను కలిసే ప్రయత్నం చేసినా వారు అంతగా ఆసక్తిని చూపలేదన్న విమర్శలు వినిపించాయి. ఇక్కాడా విజయ్‌బహుగుణ ప్రభుత్వం పట్ల అసమ్మతిని రాజేస్తూ, నిదానంగా తన శిబిరంలోని సంఖ్యను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకుందని నిర్ధరణకు వచ్చాక, అదను కోసం వేచి చూడసాగారు. విజయ్‌బహుగుణని సాధారణ నేపథ్యమేమీ కాదు. ఆది నుంచీ వారి కుటుంబం రాజకీయాలతో ముడిపడి ఉంది. దానికి తోడు న్యాయవాదిగా ఎత్తుకుపైఎత్తు వేయగల చాతుర్యమూ ఉంది. ఆ అనుభవమూ, చతురతా ఇప్పుడు కలిసివచ్చాయి.

 

మార్చి 18న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే అక్కడి ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నిధులను వెచ్చించగలదు. అలాంటి కీలకమైన బిల్లుని ఆమోదించేందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దాంతో స్పీకర్‌ బిల్లుని ఎలాగొలా పాసైందని అనిపించారు. ప్రభుత్వం కీలకమైన బిల్లుని కూడా ఆమోదింపచేయలేని పరిస్థితిలో ఉందంటూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతి పాలనను విధించింది. కేంద్ర ప్రభుత్వ చర్యని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ సోమవారం అక్కడి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవలసి ఉండగా, హడావుడిగా కొద్ది గంటల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడం ఏంటని మండిపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ భయాలు వేరేలా ఉన్నాయి...

 

71మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు, భాజపా నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గట్టు దాటడంతో బలాబలాలు తారుమారైపోయాయి. పరిస్థితి తమకు అనుకూలంగా లేదని హరీశ్‌రావత్‌కు స్పష్టం కావడంతో, అసమ్మతివాదులైన 9 మంది ఎమ్మెల్యేల మీదా అనర్హత వేటు వేయించారు. దాంతో మిగతా చిన్నాచితకా పార్టీల మద్దతుతో బలపరీక్షను దాటేయవచ్చని ఆయన ఆలోచన. ఈ వ్యూహాన్ని పసిగట్టిన కేంద్రప్రభుత్వం ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను విధించింది. పైగా అసమ్మతితో ఉన్న నాయకులను కూడా హరీశ్‌ కొనే ప్రయత్నం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన ఓ సీడీని కూడా అసమ్మతి నేతలు విడుదల చేశారు. ఈ సీడీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ కొన్ని ‘లెక్కల’ గురించి మాట్లాడటం గమనించవచ్చు. ఈ సీడీ విడుదలతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మరింత బలమైన కారణం దొరికినట్లైంది.

 

ఏదేమైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం విషాదకరం. రాజకీయ నేతలలో దిగజారుతున్న నైతిక విలువలే దీనికి కారణం కావచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా వసుధైక కుటుంబంలా అన్ని పార్టీలూ లావాదేవీలతోనే రాజకీయాలను నడిపేందుకు సిద్ధపడిపోతున్నాయి. దీనికి ఫలితాన్ని అనుభవించేది మాత్రం సామాన్యులే! మరి ఆ సామాన్యుల ఆలోచన ఎలా ఉందో! ఎవరిని ఎన్నుకున్నా ఏమున్నది గర్వకారణం అంటూ నిస్తేజంతో మునిగిపోతారో లేకపోతే పరిస్థితులను అసహ్యించుకుని తామే ప్రత్యక్ష రాజకీయాలలోకి దూసుకువస్తారో చూడాలి!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.