రాజకీయ ప్రచారానికి ప్రభుత్వోద్యోగుల వినియోగం.. బీజేపీకి రోల్ మోడల్ జగనేనా?

Publish Date:Oct 30, 2023

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక విలక్షన రాజకీయనాయకుడు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా ఉందన్న సంగతిని ఆయన విస్మరించడమే కాకుండా.. అధికారులూ, కేబినెట్ సహచరులూ కూడా మరిచిపోయేలా చేయగలిగారు. ప్రభుత్వానికీ, అధికార పార్టీకీ మధ్య ఉన్న గీతను ఆయన చెరిపేశారు. ఆ రెండూ వేరువేరు కదా అంటే.. అలా ఎలా అవుతుంది అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన ప్రసంగాలన్నీ విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే పరిమితమౌతాయి. ఇక అధికారులు సైతం పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా లేదన్నట్లుగానే పార్టీ నేతలు, కార్యకర్తల మాటకే విలువనిచ్చి తరలిస్తుంటారు. 

సంక్షమం అటూ జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసే బహిరంగ సభలన్నీ కూడా వైసీపీ ప్రచార కార్యక్రమాలుగానే ఉంటాయి. ఆయా సభలలో ఆయన విపక్షాలు, విపక్ష నేతలపై విమర్శలకే సమయం అంతా కేటాయిస్తుంటారు. ఆ సభలన్నీ ప్రభుత్వ వ్యయంతో అంటే ప్రజాధనంతోనే  నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వ యంత్రాంగమంతా వైసీపీ కోసమే పని చేస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  చెప్పుకోవచ్చు. పార్టీ  నేతలు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు జరిగిన లబ్ధి ఇదీ అని చెప్పుకోవడానికి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో నేతల కంటే అధికారుల హడావుడే ఎక్కువగా కనిపిస్తున్నది. వైసీపీ నాయకులతో పాటు అధికారులూ ఇంటింటికీ తిరిగి ప్రజలకు అందిన సంక్షేమాన్ని చెప్తున్నారు. అధికారులు రాజకీయ నాయకులకు అసిస్టెంట్లుగా, వారి తరఫున మాట్లాడే  వారిగా వ్యవహరిస్తున్నారు. సరే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  వైసీపీ నేతలకు ఎదురైన పరాభవాన్ని పక్కన పెడితే.. అధికార యంత్రాంగాన్ని ఇష్టారీతిగా వాడేసుకోవడం వైసీపీతోనే ప్రారంభమైందని చెప్పాలి.

ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కోసం ఇష్టారీతిగా వాడేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క జగన్ ప్రభుత్వమేనని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది చట్ట ప్రకారం కూడా నిషిద్ధం. ఈ విషయంలో జగన్ సర్కార్ పై విపక్షాల విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాల్సిన కేంద్రం కూడా.. ఇదేదో బాగున్నట్లుందే అని అదే దారిలో నడవడానికి రెడీ అయిపోయింది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలంటే జగన్ మార్గమే రోల్ మోడల్ అని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే జగన్ తరహాలోనే అధికార యంత్రాంగాన్ని వాడేసుకుని ప్రయోజనం పొందేలా కార్యక్రమాన్ని రూపొందించింది.

గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మోడీ సర్కార్ సాధించిన విజయాలను  ప్రభుత్వ ఉద్యోగులతో  కమిటీలను వేసి మరీ ప్రచారం చేయడానికి రెడీ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించింది. వచ్చే నెల 20 నుంచి జనవరి 25 వరకూ మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారానికి ఒక కార్యక్రమం రూపొందించింది. ఈ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో  కూడిన కమిటీలను దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి రక్షణ శాఖ ఉద్యోగులను కూడా వినియోగించుకోవడానికి సైతం మోడీ సర్కార్ వెనుకాడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలు, ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం. 

అయితే ఏపీలో ఈ నిషేధిత కార్యక్రమాన్ని జగన్ సర్కార్ కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగిస్తోంది. దీంతో జగన్ సర్కార్ నే ఆదర్శంగా తీసుకున్న చందంగా ఇప్పుడు మోడీ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలకూ, ప్రచారానికి వినియోగించుకోవడానికి రెడీ అయిపోయింది.  తాను నిత్యం ప్రవచించే భారత రాజ్యాంగం, విలువలకు తిలోదకాలిచ్చి  ఇలా ప్రభుత్వ ఉద్యోగుల చేత తన విజయాలను ప్రచారం చేయించుకోవడాన్ని మోడీ ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.