ఆంక్షలు సడలించిన అమెరికా.. ఇండియాకు భారీ ఊరట.!

Publish Date:Jul 14, 2026

Advertisement

రష్యాపై కఠిన  ఆర్థిక ఆంక్షలను విధించేందుకు ఉద్దేశించిన  కీలక బిల్లులో అమెరికా   చేసిన సవరణలు భారత్ కు భారీ ఊరట కలిగించాయి.  రష్యా నుండి పెద్ద ఎత్తున ముడి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్నఇండియా, చైనా వంటి ఆసియా దేశాలపై ప్రతిపాదించిన 500 శాతం అదనపు సుంకాలను ఈ సవరణల ద్వారా గణనీయంగా  తగ్గించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో  వ్యక్తమౌతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ కు భారీ ఉపశమనాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహానికీ తావులేవు. 

అమెరికా సెనెటర్ల సవరణతో అమెరికా చట్టసభ  ఈ నూతన బిల్లును మంగళవారం (జులై 14) ఆమోదం తెలిపింది. గతంలో రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేసే ప్రధాన   దేశాలపై గరిష్టంగా ఏకంగా 500 శాతం వరకు భారీ టారిఫ్‌లను విధించాలని బిల్లులో  అమెరికా ప్రతిపాదించింది. అయితే..  తాజా సవరణల మేరకు ఆ టారిఫ్ ను వంద శాతానికి తగ్గించింది.   ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం టారిఫ్‌ల విధింపునకు సంబంధించిన పూర్తి అధికారాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కట్టబెట్టినట్లైంది.  అంతే కాకుండా, దేశ ప్రయోజనాలను,  దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సందర్భాలలో కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చే ప్రత్యేక వెసులుబాటును కూడా అధ్యక్షుడికి దఖలు పడింది. 

గత నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో..  రష్యా నుంచి లభిస్తున్న రాయితీ ముడి చమురు  ఇండియా అధికంగా  దిగుమతి చేసుకుంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధ వ్యయాలకు నిధులు అందకుండా కట్టడి చేయడంతో పాటు, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటం, అలాగే అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడమే లక్ష్యంగా  ట్రంప్ 500శాతం టారిఫ్ లను ప్రతిపాదించారు. అయితే.. అన్ని వైపుల నుంచీ వచ్చిన ఒత్తిడి కారణంగా ఆ బిల్లుకు సవరణలు చేయకతప్పలేదు.  

US Russia sanctions bill, India Russia oil trade, Donald Trump oil tariffs, Russia sanctions relaxation, US India energy relations, Lindsey Graham Russia bill

By
en-us Political News

  
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
టాటా ఎల్క్సీ Tata Elxsi Q1 ఫలితాల తర్వాత షేరు 6% క్రాష్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై సెల్ రేటింగ్ ఇస్తూ, ఇంకా 16% మేర పతనమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాలు మరియు మార్జిన్ల లెక్కలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.