బాబు అరెస్టుకు రెండేళ్లు..
Publish Date:Sep 9, 2025
Advertisement
రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..(అంటే సెప్టెంబర్ 9 2023) అప్పటి జగన్ సర్కార్ నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసింది. స్కిల్ కేసు అంటూ నంద్యాలలో బూబు షూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబునాయుడిని నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ చేసి రాక్షసానందాన్ని పొందింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడం పట్ల అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నిరసనలు మిన్నంటాయి. చంద్రబాబు అరెస్టును ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి. నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు అరెస్టు వార్తను అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. ప్రసాదం చేసింది. ఇక మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష సాధింపు చర్యగానే అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి నగరాలలో యువత చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేపట్టారు. రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అసలు జగన్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలలో చంద్రబాబు అక్రమ అరెస్టు ఒకటి అనడంలో సందేహం లేదు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పెల్లుబికి ఆగ్రహ జ్వాలల సెగ అప్పటి జగన్ సర్కార్ కే కాదు.. అప్పట్లో మోడీ సర్కార్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకులు చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఎన్నికలకు ముందే ఖరారు చేసేసింది. 2024లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ కు ఏపీ జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్షహోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయాన్ని చవి చూపించారు.
http://www.teluguone.com/news/content/two-years-for-cbn-arrest-25-205835.html





