పడి లేచిన కెరటం.. నారా లోకేష్

Publish Date:Jan 22, 2026

Advertisement

వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం  నారా లోకేష్.  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా  పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన  నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి  సందేహాలూ, అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి.

అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా అటాక్ చేశారు.  

అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.    

ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని,  సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా   అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు.  విపక్షంలో ఉండి గ  ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు.  అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు.  తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. 

అయితే నారా లోకేష్ కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా  ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ  ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు.

కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది.  ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని  తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి.  లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని   ప్రశంసలు కురిపించారంటే దటీజ్ లోకేష్. 

ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులను తీసుకురావడంలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇదే దీక్ష , ఇదే సంకల్పంతో ఆయన మున్ముందు మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ నారా లోకేష్ కు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

By
en-us Political News

  
ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు.
నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.
అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇరువురూ సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను పటిష్ఠం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు. ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు.
ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది. అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు.. మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం.
హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్ షాక్‌కు గురైనట్లు సమాచారం.
చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి? కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా గొంతుపోవడం, అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.