ఐపీఎల్ నిబంధనల మేరకు బెన్ డకెట్ పై రెండేళ్ల నిషేధం?

Publish Date:Mar 26, 2026

Advertisement

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ పై ఐపీఎల్ రెండేళ్ల నిషేధం విధించనుందా? అంటే క్రీడా పండితులు ఔననే అంటున్నారు. వ్యక్తిగత కారణాలు చూపుతూ బెన్ డకెట్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొని అమ్ముడైన తరువాత సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకునే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా ఐపీఎల్ ఇటీవల నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల మేరకు ఈ ఏడు ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన బెన్ డకెట్ పై రెండేళ్ల నిషేధం అనివార్యమని అంటున్నారు. విషయం ఏమిటంటే.. వ్యక్తిగత కారణాలు, యాషెస్ సన్నద్ధత కారణాలుగా చూపుతూ ఈ ఏడు ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు బెన్ డకెట్ ప్రకటించాడు. 

గత ఏడాది జరిగిన మినీ వేలంలో బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం   2 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి  సొంతం చేసుకుంది. అయితే, తాజాగా డకెట్ సోషల్ మీడియా వేదికగా   తాను ఈ టోర్నీలో భాగం కాలేకపోతున్నానని ప్రకటించాడు.  ఢిల్లీ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెప్పాడు. తన నిర్ణయం జట్టుకు ఇబ్బంది కలిగించినా, తన కెరీర్ దృష్ట్యా అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్న డకెట్ రాబోయే టెస్టు సిరీస్‌లలో ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం కోసం శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావడం కోసమే ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు. 

అయితే, ఐపీఎల్ కొత్త నిబంధనల మేరకు వేలంలో అమ్ముడైన ఏ ఆటగాడైనా  ఆరోగ్య కారణాలు లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే, వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఇప్పుడు బెన్ డకెట్  ఆరోగ్య కారణాల దృష్ట్యా కాకుండా..  పనిభారం, సన్నద్ధత అంటూ ఐపీఎల్ నుంచి తప్పుకున్నందున అతడిపై రెండేళ్ల నిషేధం తథ్యమని అంటున్నారు. 

గతంలో ఆటగాళ్లు వేలంలో అమ్ముడైన తర్వాత చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయేవి. ఈ ధోరణిని అరికట్టడానికే బీసీసీఐ ఈ కఠిన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే బెన్ డకెట్ నిర్ణయంతో  ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకులాట ప్రారంభించింది. 

By
en-us Political News

  
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.