సిలెండర్ పేలి రెండు ఇళ్లు దగ్ధం
Publish Date:Oct 2, 2025
Advertisement
జిల్లాలో పండుగపూట గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమైన ఘటన నంద్యాల జిల్లా శివనగరంలో జరిగింది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన గోవింద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అయితే అలా వెళ్లే సమయంలో గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆపడం మరచిపోయారు. దీంతో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోవందరెడ్డి ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఇళ్లు దగ్ధమైంది. పేలుడు సంభవించిన సమయంలో రెండు ఇళ్లలోనూ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ పేలుడు కారణంగా రెండు ఇళ్లలోనూ విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-houses-burned-in-gas-cyllender-blast-36-207245.html
http://www.teluguone.com/news/content/two-houses-burned-in-gas-cyllender-blast-36-207245.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





