కుక్కలతో పోల్చి సంబరపడిపోకు.. పందికేం తెలుసు పాండ్స్ వాసన?
Publish Date:Aug 31, 2019

Advertisement
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం హద్దు దాటుతోంది. నేతలు హద్దు దాటి ఘాటైన పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. టీడీపీ నేతల మీద ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
"ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రీ కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే తెలుసు వాటికి. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారు." అంటూ చంద్రబాబు, నారా లోకేష్ లను ట్యాగ్ చేస్తూ విజయ సాయి ట్వీట్ చేశారు.
"రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారే. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు." అని విజయసాయి విమర్శించారు.
పెంపుడుకుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. "అయినా పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన? దొంగలెక్కలు రాసేవాడికి కార్యకర్తలు, నాయకుల విలువ ఎలా తెలుస్తుంది? పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేవారిని కుక్కలతో పోల్చి సంబరపడిపోతున్నావు, నీలాంటి అవినీతి పందులకు త్వరలోనే జైలు పూజ చేయిస్తాం. త్వరలోనే నీకు చిప్పకూడు ఖాయం" అంటూ బుద్ధా ట్వీట్ చేశారు.
"మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెడితే ఈ రోజు పిచ్చికూతలు కూయడానికి మీరు ఉండేవారు కాదేమో!" అంటూ విజయ సాయి వ్యాఖ్యలకు బుద్ధా బదులిచ్చారు.
http://www.teluguone.com/news/content/twitter-war-between-vijaya-sai-reddy-and-buddha-venkanna-39-88997.html












