Publish Date:Jul 16, 2022
భారీ వర్షాలు తెరిపిలేకుండా పడుతున్నపుడు పట్టణాల్లో, గ్రామాల్లో రోడ్లు నీటికుంటలుగా మారడం చాలా సహజం. ఇది చాలాకాలం నుంచి అందరికీ తెలిసినది, చూస్తున్నదీను. ప్రస్తుతం వర్షాల దెబ్బకి రోడ్లు మరీ దెబ్బతిన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లమీదకి నీరు చేరుకుపోయి కొన్ని ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితుల్లో జనాలు వున్నారు. ఇవన్నీ సామాన్య జనానికి తెలిసినదానికంటే సీఎంకి, నాయకు లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియకా కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వర్షాలకు రోడ్లు బాగా పాడయ్యా యి. చాలాకాలం నుంచి రోడ్లు విస్తరణ, వాటిని మరింత బాగుచేయాల్సిన అవసరం వుందని ప్రజలతో పాటు సంబంధిత అధికారులు గోడు పెడుతూనే వున్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూనే వచ్చిం ది. ఇపుడు ఈ దుస్థితికి వదిలేసింది.
అయ్యా ఇవి మన రోడ్లే అని వీడియో తీసి చూపుతున్నా అబ్బే అబ ద్దాలు, మన రోడ్లు మరీ ఇంత దారు ణంగా పాడవలేదని ట్విటర్ తాత విజయసాయి రెడ్డిగారి ఉవాచ. ఇంత కంటే హాస్యాస్పదం మరోటి వుంటుందా? మా మాట కాదు ప్రజల మాటా వినకుంటే ఎలా విజయసాయీ అంటూ విపక్షాలు మండి పడుతున్నాయి.
మరీ విడ్డూరమేమంటే గుంటల్లో చిక్కుకుని ప్రమాదానికి గురయిన బండి తెలంగాణాకి సంబంధించినద నడం. పైగా ఆఫోటో నిజామాబాద్‌లో ఎప్పుడో జరిగినదని దాన్ని ఇపుడు ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రదర్శిస్తున్నారని ట్విటర్ తాతగారు ఆగ్రహించడం మరీ దారుణం. ఆటో ప్రమాదం తూర్పు గోదా వరి జిల్లా రాజమండ్రి కి చెందిన పొన్న వీరబ్బు ది అని అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని రిపేర్ ఖర్చులకి 15000 వరకు అవ్తుందని డ్రైవర్ గోల పెడుతున్నాడు.
చిత్రమేమంటే, ఆటో ప్రమాదం రహదారి లో ఉన్న గుంటల వల్ల జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తుంటే, తెలంగాణా నిజామాబాద్ లో గుంటలు టి.డి.పి. వాళ్ళే తవ్వుతున్న రేమో అని తప్పు డు ఆరోపణలు చేసిన ట్విట్టర్ తాత ని ఎవరు క్షమిస్తారు. ప్రమాదం జరిగినది ఎక్కడో తెలియకుండానే ఫోటోలతో సహా చూపుతారా? ఆ ప్రాంతం ఆంధ్రానో, తెలంగాణానో తెలియని స్థితిలో ప్రజలు లేరన్నది విజయసాయి రెడ్డి తెలుసుకోవాలి. అయినా లేనిదాన్ని ఉంది అని ఉన్న దాన్ని లేదు అని చూపించడం లో ఈ ట్విట్టర్ తాత సిద్దహస్తుడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twitter-grandpatoo-much-25-139894.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!