రియా చాలా చెప్పింది.. ఆ త‌ర్వాత‌..?

Publish Date:Sep 15, 2020

Advertisement

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఎన్నెన్ని సంచ‌ల‌నాలకు సాక్షీభూత‌మైంది! ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌ది! ఎంతెంత మందిని బైటికి తీస్తున్న‌ది! ఇదంతా ఒక క్ర‌యిమ్ థ్రిల్ల‌ర్ బాలీవుడ్ సినిమాను త‌ల‌పిస్తున్న‌ది. ప్ర‌ధానంగా రియా చ‌క్ర‌వ‌ర్తి తెర‌మీదికొచ్చింది. ఆమె సుశాంత్ ప్రియురాలిగా ముద్ర‌ప‌డి అనుమానాస్ప‌ద స్వార్ధ‌పూరిత చ‌ర్య‌ల‌తో సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌న్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఇదంతా స‌రే. రోజువారీ ప‌రిణామాలు తెలుస్తూనే ఉన్నాయి. సుశాంత్ మ‌ర‌ణం హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అన్న‌ది తేల్చేందుకు మొద‌లైన ఈ కేసు ద‌ర్యాప్తు బీహార్‌, మ‌హ‌రాష్ట్ర పోలీసుల మ‌ధ్య భేదాభిప్రాయాల‌తో ఇంకొన్ని మ‌లుపులు తిరిగి చివ‌రికి డ్రగ్స్ బాట ప‌ట్టింది. సుశాంత్ మ‌ర‌ణంతో బాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు గాలిలో ఊగిస‌లాడాయి. కొంద‌రు తెగువ క‌లిగిన వారైతే కొన్ని పేర్లు బ‌య‌ట పెట్టారు కూడా. అందులోని నిజానిజాలు నిర్ధార‌ణ కావాల్సి ఉంది. అలాగే డ్ర‌గ్స్ కేసులోనూ చాలా పేర్లు తెర‌మీదికొస్తున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న జాబితాలో ప్ర‌ముఖంగా తెలుగు హీరోయిన్ రకుల్ పేరు వ‌చ్చింది. వాళ్లిద్ద‌రూ ముంబాయ్ లో క‌లిసి దిగిన ఫోటోలు కూడా బ‌హిరంగ‌మ‌య్యాయి. 

 

సుశాంత్ కు చెందిన ఒక ఫామ్ హౌజ్‌లో బాలీవుడ్, తాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌చూ క‌లిసి పార్టీలు చేసుకుంటుంటార‌ని రియా చెప్పింది. ఆ పార్టీల్లో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను తీసుకుంటార‌ని కూడా చెప్పింది. ఇదేదో రియా ఇప్పుడు ఒక అండ‌పిండ బ్ర‌హ్మాండాన్ని బ‌ద్ద‌లు చేసింద‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. సినీన‌టులు, ఇంకా చెప్పాలంటే ఈనాటి టీవీ న‌టులు య‌థేచ్చ‌గా మాద‌క ద్ర‌వ్యాల‌ను వాడుతున్నారు. త‌మ గ్లామ‌ర్ పెంచుకోవ‌డానికి అవి వాడ‌క త‌ప్ప‌ద‌ని కొంద‌రు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లిచ్చారు. కొద్దిపాటి మోతాదులో వాటిని తీసుకోవ‌డం నేరం కాద‌ని కూడా వారు త‌మ చ‌ర్య‌ల్ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇదంతా ప‌క్క‌న బెడితే రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న పేర్ల మీద మాద‌క‌ద్రవ్యాల నిరోధ‌క శాఖ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఇక్క‌డ ముఖ్యాంశం. నిన్న‌టికి నిన్న ఈ కేసు విచారిస్తున్న సంబంధిత శాఖాధికారి త‌మ జాబితాలో బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లేవీ లేవ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాము కేవ‌లం మ‌త్తు ప‌దార్ధాల ఏజెంట్ల‌ను, త‌యీరీదార్ల‌ను, స‌ర‌ఫ‌రాదార్ల‌ను మాత్ర‌మే ప‌ట్టుకుంటున్నామ‌ని, వారిమీదే నిఘా ఉంచామ‌ని వెల్ల‌డించారు. ఇది చాలా కీల‌క ప్ర‌కట‌న‌. మ‌రి రియా చెప్పే పేర్ల సంగ‌తేమిటి? సుశాంత్ మ‌ర‌ణం కేసుని దాని ప‌రిధిని దాటించి మ‌త్తుప‌దార్ధాల వైపుకి మ‌ళ్లించారు. పోనీ మ‌త్తుప‌దార్ధాలు సేవిస్తున్న వారి ఆట క‌ట్టిస్తారా అంటే తాము చేయాల్సింది అది కాద‌ని అధికారులే చెబుతున్నారు. 

 

2017లో  తెలంగాణా రాష్ట్రంలోనూ తెలుగు సినీ న‌టులు మాద‌క ద్ర‌వ్యాలు వాడుతున్నార‌న్న కేసు కొద్ది వారాల పాటు హ‌ల్ చ‌ల్ చేసింది. పూరీ జ‌గ‌న్నాధ్‌, ఛార్మి, న‌వ‌దీప్‌, త‌రుణ్‌, సుబ్బ‌రాజు, సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడు త‌దిత‌రుల్ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు టీమ్ విచారించింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం. ఏరోజుకారోజు ద‌ర్యాప్తుకి పిలిచిన వారిని అరెస్టు చేస్తార‌న్న ఉత్కంఠ‌. కాని అది అతి తేలిగ్గా అట‌కెక్కింది. మాద‌క‌ద్రవ్యాలు తీసుకునే వారు నేర‌స్ధులు కార‌న్న సిద్దాంతాన్ని తెర‌మీదికి తెచ్చారు. కేవలం వీరికి స‌రఫ‌రా చేసిన‌వారిని క‌నుగొనేందుకే వారిని పిలిచి ప్ర‌శ్నించిన‌ట్టు తేల్చేశారు. 

 

ఇప్పుడు రియా డ్ర‌గ్స్ కేసు ఎటు వెళ్ల‌బోతోంది? ఆమెని అరెస్టు చేశారు. ఆమె సుశాంత్‌కి మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చింద‌న్న‌ది అభియోగం. ఒక‌వంక స్వ‌ల్ప మోతాదులో అది తీసుకోవ‌డం నేరం కాదంటున్నారు. మ‌రి ఆమె అత‌డికి స్వ‌ల్ప మోతాదులోనే తెప్పించి ఇచ్చానంటున్న‌ది. దానివ‌ల్లే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌లు తేలుస్తాయా? సుశాంత్‌ని మాన‌సికంగా వ‌త్తిడికి గురిచేసి, అత‌డికి సినిమా అవ‌కాశాలు రాకుండా చేశార‌న్న ఒక ప్రధాన అభియోగం ఎటు పోయిన‌ట్టు? అది వ‌దిలేసి, సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా మీద నిఘా పెట్టారు. సుశాంత్ మ‌ర‌ణించాక అత‌ని బ్యాంకు అకౌంట్ నుంచి కొన్ని కోట్లు మాయ‌మ‌య్యాయి. ఇది రియా ప‌నేన‌ని సుశాంత్ తండ్రి అభియోగం. ఆ ప్ర‌కారం పోలీసులు ఆమె మీద నిఘా పెట్టారు. చివ‌రికి అది మాద‌క ద్ర‌వ్యాల వైపు మ‌ళ్లింది. అంటే ఇప్ప‌టికి రెండు మ‌లుపులు తిరిగిన‌ట్టు. ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతంది?  మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌క‌లు పేర్లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. కంగ‌నా ర‌నౌత్ ప‌రోక్ష ప్రస్తావ‌న‌లో కొన్ని పేర్లు తెర‌మీదికి తెచ్చింది. కాని వారికి ఏమీ కాదు. కేవ‌లం రియాకు మాత్ర‌మే ఇది నేరంగా వ‌ర్తిస్తుంది. మ‌న చ‌ట్టాల్లోని లొసుగులు క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతున్నాయ్‌!

-రాజా రామ్మోహ‌న్ రాయ్‌

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.